Bowlers Zero Wide Ball: ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న క్రికెట్లో ఒకే ఒక్క బంతి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. డొమెస్టిక్ మొదలుకొని అంతర్జాతీయ క్రికెట్ దాకా ఒక్క బాల్‌తో మ్యాచ్ ఫలితాలు మారిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక ఎక్స్ట్రా (నో బాల్, వైడ్) బంతులతో అప్పుడప్పుడు ఆయా జట్లు భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక్క వైడ్/ నోబాల్ వేయని బౌలర్లు ఉన్నారన్న విషయం మీకు తెలుసా?
- ఇయాన్ బోథమ్: ఇయాన్ బోథమ్ లెజెండరీ ఇంగ్లీష్ ఆల్-రౌండర్. అతడు క్రీజులో బ్యాటింగ్, బాలింగ్ రెండింటితో చెలరేగిపోతాడు. బోథమ్ కెరీర్లో 208 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్లో బోథమ్ ఒక్కసారి కూడా వైడ్, నో బాల్ వేయలేదు. అంటే తన ప్రత్యర్థి జట్టుకు బోథమ్ కెరీర్ మొత్తంలో ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదన్న మాట.
- బాబ్ విల్లీస్: తన పేస్‌తో బాబ్ విల్లీస్, ప్రత్యర్థి బ్యాటర్‌లకు చుక్కలు చూపించేవాడు. కెరీర్లో మొత్తం 154 మ్యాచ్‌లు ఆడిన విల్లీస్ ఒక్కసారి కూడా గీత దాటి బంతి వేయలేదు.
- ఫ్రెడ్ ట్రూమాన్: ఫ్రెడ్ ట్రూమాన్‌ను ఫ్యాన్స్ స్పీడ్‌స్టర్ అని అనేవారు. పూర్తి కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తూ తన కెరీర్లో వైడ్ బాల్‌కు ఛాన్సే ఇవ్వలేదు. అతడి కెరీర్లో 67 టెస్టులు ఆడిన ఫ్రెడ్ ట్రూమాన్ ఒక ఎక్స్ట్రా వేయలేదు.
- గ్యారీ సోబర్స్: లెజెండరీ వెస్టిండీస్ ప్లేయర్ గ్యారీ సోబర్స్ బ్యాటింగే కాదు బౌలింగ్‌లోనూ అదరగొడతాడు. కెరీర్‌లో 20,660 బంతులు వేసిన సోబర్స్ ఒక్కసారి కూడా వైడ్‌బాల్ లైన్ దాటలేదు.
- క్లారీ గ్రిమ్మెట్: ఆస్ట్రేలియాకు చెందిన క్లారీ గ్రిమ్మెట్ ఓ స్పిన్ లెజెండ్. 37 టెస్టుల్లో కలిపి క్లారీ గ్రిమ్మెట్ 14,453 బంతులు వేశాడు. అందులో ఒక్క బంతికూడా వైడ్/ నో బాల్‌గా వేయలేదు.
- రిచర్డ్ హ్యాడ్లీ: న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రిచర్డ్ హ్యాడ్లీ స్కిల్స్ ఉన్న ఆల్ రౌండర్. 86 టెస్ట్‌లు, 115 వన్డేలలు ఆడిన హ్యాడ్లీ కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో ఒక్క వైడ్ బాల్ కూడా వేయకుండా తిరుగులేని బౌలింగ్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పదో వికెట్‌కు రికార్డ్ పార్ట్నర్షిప్ - టాప్ 10 జోడీలివే!