BCCI Awards 2024 : టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'కు (BCCI's Lifetime Achievement Awards-2024) ఎంపిక చేసింది బీసీసీఐ. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలను అందించినందుకు గుర్తుగా ఆయనకు ఈ అవార్డును అందించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆటగాడిగా, హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఆయన ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
శాస్త్రితో పాటు టీమ్ఇండియా యువ బ్యాటర్ 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ను కూడా ఓ అవార్డు వరించింది. 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీలో అతడిని ఈ అవార్డుకు సెలెక్ట్ చేసింది బీసీసీఐ. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్క్‌ను దాటడమే కాకుండా ఐదు సెంచరీలను నమోదు చేసిన గిల్‌కు 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.
ప్రదానోత్సవానికి ఇరు జట్లు
గురువారం(జనవరి 25) నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇరు జట్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మంగళవారం(జనవరి 23న) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇక ఇదే కార్యక్రమంలో ముంబయికి చెందిన యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీలకు సైతం అవార్డులను అందించనుంది బీసీసీఐ.
-
Shubman Gill set to receive Indian Cricketer of the year Award at the BCCI Awards tomorrow.
— Saabir Zafar (@Saabir_Saabu01) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Ravi Shastri to receive BCCI's lifetime achievement award tomorrow.#BCCIAwards pic.twitter.com/N9VLA8fVC9
">Shubman Gill set to receive Indian Cricketer of the year Award at the BCCI Awards tomorrow.
— Saabir Zafar (@Saabir_Saabu01) January 22, 2024
Ravi Shastri to receive BCCI's lifetime achievement award tomorrow.#BCCIAwards pic.twitter.com/N9VLA8fVC9Shubman Gill set to receive Indian Cricketer of the year Award at the BCCI Awards tomorrow.
— Saabir Zafar (@Saabir_Saabu01) January 22, 2024
Ravi Shastri to receive BCCI's lifetime achievement award tomorrow.#BCCIAwards pic.twitter.com/N9VLA8fVC9
రవిశాస్త్రి గణాంకాలు
2017-2021 సమయంలో టీమ్ఇండియా కోచ్‌గా వ్యవహరించారు రవిశాస్త్రి. 61 ఏళ్ల ఈయన సారథ్యంలో జట్టు అత్యుత్తమంగా ప్రదర్శించింది. భారత జట్టుకు దూకుడు నేర్పింది రవిశాస్త్రినే అని అంటుంటారు చాలామంది. రిటైర్మెంట్ తర్వాత టీవీ వ్యాఖ్యాతగా బాధ్యతలను చేపట్టిన ఈయన తనదైన శైలిలో కామెంట్రీ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.
- 1981-92 మధ్యకాలంలో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడారు.
- దాదాపు 7000 పరుగులు తీసి 280 వికెట్లు పడగొట్టారు.
- తన కెరీర్‌లో 15సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
రవిశాస్త్రి హయాంలో హైలైట్ ఏంటంటే ఆస్ట్రేలియాతో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను గెలవడం. కానీ ఐసీసీ టైటిల్‌ను మాత్రం గెలవలేకపోయింది.