ETV Bharat / sports

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్​ - శ్రేయస్​, ఇషాన్​పై వేటు! - బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్

BCCI Annual Contract : 2023-24వ ఏడాదికిగానూ టీమ్ఇండియా బీసీసీఐ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. అయితే ఇందులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్​ కిషన్ పేర్లను చేర్చలేదు.

BCCI Contract 2023-2024
BCCI Contract 2023-2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 6:14 PM IST

Updated : Feb 28, 2024, 7:25 PM IST

BCCI Annual Contract : 2023-24వ ఏడాదికిగానూ టీమ్ఇండియా బీసీసీఐ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రేడ్​ ఏ ప్లస్​, ఏ, బీ, సీలోకి ఆయా ప్లేయర్ల కాంట్రాక్ట్​లను సవరించింది. అయితే ఈ లిస్ట్​లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను చేర్చకపోవడం గమనార్హం. ఇక గ్రేడ్​ ఏ ప్లస్​లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను చేర్చింది.

ఆ తర్వాతి గ్రేడ్​ అయిన 'ఏ'లో రవిచంద్రన్ అశ్విన్‌, మహ్మద్​ షమీ, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్​ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యాలు ఉన్నారు. అయితే గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్‌ పాండ్య ఏ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ను నిలుపుకున్నాడు. ఇక బీలో ఉన్న కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు ఏ క్లాస్​కి ప్రమోషన్‌ దక్కింది.

ఇక బి కేటగిరీలో ఉన్న శ్రేయస్‌ అయ్యర్​ను లిస్ట్​లో నుంచి తొలగించింది. గతేడాది కాంట్రాక్ట్‌లో లేని యంగ్​ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ ఈ సారి నేరుగా బీ గ్రేడ్​లోకి ప్రవేశించాడు. దీంతో ఈ కేటగిరీలో జైస్వాల్​తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్​లు ఉన్నారు.

మరోవైపు సీ కేటగిరీలో ఉన్న ఇషాన్​ కిషన్​ పై వేటు పడింది. దీంతో రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముకేశ్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేష్ ఖాన్‌, రజత్‌ పాటిదార్​లు ఈ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.

ప్లేయర్ల వార్షిక వేతనాలు ఎంతంటే ?
BCCI Annual Contract Salary : ఇక ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు బీసీసీఐ వార్షిక వేతనం కింద ఏడాదికి రూ. 7 కోట్లు ఇస్తుంది. ఆ తర్వాతి కేటగిరీ క్రికెటర్లకు రూ. 5 కోట్లు, ఇక 'బి', 'సీ' కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు, రూ. కోటి రూపాయల వార్షిక వేతనాన్ని అందిస్తుంది.

టీమ్​ఇండియా ఆటగాళ్లకు అదిరిపోయే ఆఫర్!

రాంచీ టెస్టుకు బుమ్రా దూరం!- 'ఈటీవీ భారత్' చిట్​చాట్​లో బీసీసీఐ మెంబర్ క్లారిటీ

Last Updated : Feb 28, 2024, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.