BCCI 10 Point Policy : గత మ్యాచ్‌ల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తాజాగా టీమ్ఇండియా ప్లేయర్ల కోసం 10 పాయింట్లతో కూడిన ఓ క్రమశిక్షణ గైడ్‌లైన్స్ జారీ చేసింది. వాటిలో దేన్ని ఉల్లంఘించిన కూడా ప్లేయర్లకు ఫైన్స్ విధించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ మార్పులకు కావాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే?
బీసీసీఐ తెచ్చిన రూల్స్ ఇవే :
- దేశవాళి టోర్నీల్లో ప్లేయర్లు ఆడితేనే వారిని నేషనల్ టీమ్‌లోకి తీసుకోవడం, అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హులుగా పరిగణించనున్నారు.
- ప్లేయర్లు తమ ఫ్యామిలీలతో కాకుండా టీమ్‌తోనే మ్యాచ్‌లు అలాగే ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేందుకు ప్రయాణించాల్సి ఉంటుంది.
- ప్లేయర్ల బ్యాగేజ్‌పై లిమిట్.
- ప్లేయర్లు తమ పర్సనల్ స్టాఫ్‌ను( స్టైలిస్ట్స్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్, కుక్) వెంట తీసుకెళ్లాలంటే బీసీసీఐ పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
- ప్లేయర్లు తమ క్రికెట్ కిట్స్, ట్రావెల్ బ్యాగ్స్‌ను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు మాత్రమే తరలించాలి.
- ప్రాక్టీస్ సెషన్‌కు ప్లేయర్లందరూ హాజరు కావాల్సి ఉంటుంది.
- ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడే సమయంలోనూ ప్లేయర్స్ ఎలాంటి యాడ్ షూట్స్‌లో పాల్గొనడానికి వీళ్లేదు. కేవలం క్రికెట్‌పై మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
- ఫ్యామిలీ ట్రావెల్ పాలసీని సైతం రూపొందించింది బీసీసీఐ. 45 రోజుల పాటు సిరీస్ ఉంటే కేవలం రెండు వారాలు మాత్రమే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
- ప్లేయర్లంతా బీసీసీఐ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
- సిరీస్ అయ్యేంతవరకూ ప్లేయర్లందరూ టీమ్‌తోనే ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ అనుకున్న సమాయానికి ముందుగానే మ్యాచ్ అయిపోయినా కూడా జట్టుతో ఉండటం ద్వారా యూనిటీ పెరుగుతుందని బీసీసీఐ అభిప్రాయం.