Ind vs Ban U19 Asia Cup 2024 : అండర్ 19 ఆసియా కప్ 2024 ఫైనల్లో యువ భారత్‌కు షాక్ తగిలింది. టైటిల్ పోరులో బంగ్లాతో తలపడ్డ టీమ్ఇండియా 59 పరుగుల తేడాతో ఓడింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (24 పరుగులు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలు పెట్టుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (9 పరుగులు) తీవ్రంగా నిరాశ పర్చాడు. గతేడాది విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హసన్ (47 పరుగులు; 65 బంతుల్లో 3 x4 ), షిహాబ్ (40 పరుగులు; 67 బంతుల్లో 3x4, 1X6), ఫరిద్ హసన్ (39 పరుగులు; 49 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా, చేతన్ శర్మ , హార్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో 1 వికెట్ పడగొట్టారు. కాగా, గతేడాది కూడా భారత్‌ను బంగ్లాదేశ్ సెమీ ఫైనల్లో ఓడించింది.
India U19 came close to the target but it's Bangladesh U19 who win the #Final
— BCCI (@BCCI) December 8, 2024
Scorecard ▶️ https://t.co/L3DyqoSp4E#TeamIndia | #ACC | #ACCMensU19AsiaCup pic.twitter.com/rcqf93J3TX
తాజా పరాజయంతో టీమ్ఇండియాకు ఆదివారం ఇది మూడో ఓటమి. ఉదయం ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో సీనియర్ పురుషుల జట్టు 10 వికెట్ల తేడాతో ఓడింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లోనూ తేలిపోయిన టీమ్ఇండియ ఆసీస్ ముందు 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అతి చిన్న టార్గెట్‌ను ఆసీస్ 20 బంతుల్లో వికెట్ కోల్పోకుండా ఛేదించేసింది. ఆ తర్వాత భారత్- ఆసీస్ మహిళల పోరులోనూ టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ 122 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా మహిళలు 249 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘోర ఓటమి- మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్‌ప్రీత్ సేన - సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం