Babita Phogat Allegations on Aamir khan Dangal : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీ టీమ్‌పై రెజ్లర్ బబితా ఫొగాట్ కీలక ఆరోపణలు చేసింది. ఈ చిత్రం రూ.2000 కోట్లు వసూలు చేసినప్పటికీ, తమకు మాత్రం రూ.కోటి రూపాయిలు మాత్రమే అందాయని చెప్పింది.
"చండీగఢ్‌కు చెందిన ఒక విలేకరి మా ఫ్యామిలీ (మహవీర్, ఆయన ఇద్దరు కుమార్తెలు గీత, బబిత) గురించి ఒక కథనాన్ని రాశారు. ఆ వార్త చదివిన బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ టీమ్ 2010లో మమ్మల్ని సంప్రదించి, ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. కొంత కాలం తర్వాత నితీశ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి కలిశారు. సినిమాగా తెరకెక్కిస్తానని చెప్పి, కథ చెప్పారు. అప్పుడు మేము చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాం. అయితే, సినిమాలో మా పేర్లు వాడనని చెప్పారు. దీనికి నా తండ్రి అంగీకరించలేదు. ఒకవేళ సినిమా తెరకెక్కిస్తే మా పేర్లతోనే చేయాలని అడిగారు. దంగల్ విడుదల అయ్యాక మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. దీంతో భావోద్వేగానికి గురయ్యా" అని బబిత తెలిపింది. అయితే ఈ చిత్రం రూ.2000 కోట్లు వసూలు చేయగా, తమకు మాత్రం కోటి రూపాయిలు మాత్రమే అందాయని వెల్లడించింది.
దంగల్ విజయం సాధించిన తర్వాత ఆమిర్ ఖాన్ టీమ్‌ను తన తండ్రి సంప్రదించినట్లు చెప్పింది బబిత. తమ గ్రామంలో అకాడమీ నిర్మించేందుకు సాయం చేయమని కోరగా, దానికి వారు అస్సలు పట్టించుకోలేదని తెలిపింది. అకాడమీ నిర్మాణానికి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, కానీ అంత డబ్బు తమ దగ్గర లేకపోవడం వల్లే, టీమ్‌ను సంప్రదించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాక్షిమాలిక్ వ్యాఖ్యలపై స్పందించిన బబిత - మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడంటూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భాజపా నేత బబితా ఫొగాట్ తమను సంప్రదించారని సాక్షి మాలిక్ ఇటీవలే ఆరోపించారు. దీనిపై తాజాగా బబిత స్పందించింది. "ఆమె నాపై నిరాధార ఆరోపణలు చేస్తోంది. లైంగిక వేధింపుల విషయంలో నాపై విమర్శలు చేసినా చేయొచ్చు. గంగానదిలో మెడల్స్ వదిలేయాలనే ఆలోచన బబితదే అని చెప్పినా చెప్పొచ్చు. అసలు నిరసన వేదిక దగ్గరకు కాంగ్రెస్ లీడర్ ప్రియాంకా గాంధీ ఎవరి కోసం ఆహారం పంపారు? ఆ విషయంపై సాక్షికే స్పష్టత ఇవ్వాలి" అని అన్నారు.
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు - తిప్పికొట్టిన వినేశ్ ఫొగాట్!
పాక్‌పై కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్!- 53 బంతుల్లోనే 82 పరుగులు