Aus vs Wi 2nd Test: ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. ఆసీస్ కంచుకోట గబ్బా మైదానంలో జరిగిన రెండో టెస్టులో విండీస్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. విండీస్ పేసర్ షామర్ జోసెఫ్ 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి, తమ జట్టుకు టెస్టుల్లో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రా గా ముగిసింది.
215 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ క్రమంగా వికెట్లో కోల్పోయింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 పరుగులు) ఒక్కడే పోరాడాడు. అతడికి కామెరూన్ గ్రీన్ (42 పరుగులు) మాత్రమే సహకారం అందించాడు. ఉస్మాన్ ఖవాజా (10), మార్నస్ లబుషేన్ (5), మిచెల్ మార్ష్ (10), అలెక్స్ కేరీ (2) విఫలమయ్యారు. స్టార్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం.
-
🎙️ “The West Indies have created the most amazing thing here in the world of cricket.”#WTC25| #AUSvWI 📝: https://t.co/NejxA1uZAr pic.twitter.com/iwNjAPxiqv
— ICC (@ICC) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">🎙️ “The West Indies have created the most amazing thing here in the world of cricket.”#WTC25| #AUSvWI 📝: https://t.co/NejxA1uZAr pic.twitter.com/iwNjAPxiqv
— ICC (@ICC) January 28, 2024🎙️ “The West Indies have created the most amazing thing here in the world of cricket.”#WTC25| #AUSvWI 📝: https://t.co/NejxA1uZAr pic.twitter.com/iwNjAPxiqv
— ICC (@ICC) January 28, 2024
గబ్బాలో ఆసీస్ రికార్డ్: బ్రిస్బేన్ గబ్బా మైదానంలో ఆసీస్‌కు ఘనమైన రికార్డ్ ఉంది. టెస్టుల్లో గబ్బా మైదానం ఆసీస్‌కు కంచుకోట లాంటింది. అలాంటి గబ్బాలో గ్రౌండ్లో ఆసీస్ చివరిసారిగా 2021 జనవరిలో భారత్‌పై ఓడగా, తాజాగా విండీస్ చేతిలో భంగపడింది.
డే అండ్ నైట్ టెస్టులో తొలి ఓటమి: పింక్ బాల్ (డే అండ్ నైట్ టెస్టు) మ్యాచ్‌లో ఆసీస్ తొలిసారి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ 11 సార్లు పింక్‌బాల్ టెస్టుల్లో ఆడితే, అన్నింట్లోనూ విజయం సాధించింది.
షామర్ జోసేఫ్ అదుర్స్: ఈ మ్యాచ్ మూడో రోజు షమర్ జోసేఫ్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి నేరుగా జోసేఫ్ కాలికి బలంగా తగిలింది. దీంతో జోసేఫ్ నొప్పితో తీవ్రంగా బాధపడుతూ క్రీజును (రిటైర్డ్ ఔట్) వదిలాడు. ఇక వేగంగా కోలుకున్న జోసేఫ్, ఈరోజు (నాలుగో రోజు) సుమారూ 150kmph స్పీడ్‌తో బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 7 వికెట్లు నేలకూల్చి విండీస్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.
- వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311-10
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 289-9 D (డిక్లేర్డ్)
- వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 193
- ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్: 207-10
-
Windies skipper Kraigg Brathwaite calls out former Aussie quick Rodney Hogg after a win for the ages at the Gabba #AUSvWI pic.twitter.com/OMENyIW7rf
— cricket.com.au (@cricketcomau) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Windies skipper Kraigg Brathwaite calls out former Aussie quick Rodney Hogg after a win for the ages at the Gabba #AUSvWI pic.twitter.com/OMENyIW7rf
— cricket.com.au (@cricketcomau) January 28, 2024Windies skipper Kraigg Brathwaite calls out former Aussie quick Rodney Hogg after a win for the ages at the Gabba #AUSvWI pic.twitter.com/OMENyIW7rf
— cricket.com.au (@cricketcomau) January 28, 2024
-
డేవిడ్ వార్నర్‌కు రీప్లేస్మెంట్ - ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్
చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్