Ashwin Records : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే తొలి టెస్టులో పలు ఘతనలు సాధించిన అశ్విన్, తాజాగా రెండో మ్యాచ్లో మరో రికార్డు సృష్టించాడు. టెస్టు ఫార్మాట్ క్రికెట్లో ఆసియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అవతరించాడు. ఇప్పటివరకు అశ్విన్ ఆసియాలో 420 వికెట్లు నేలకూల్చాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (419 వికెట్లు)ను అధిగమించాడు.
కాన్పూర్ టెస్టులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొసన్ షాంటో వికెట్ పడగొట్టిన అశ్విన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. కాగా, ఓవరాల్గా టెస్టు క్రికెట్లో ఆసియాలో అత్యధిక వికెట్లు దక్కించుకున్న రెండో బౌలర్గా అశ్విన్ కొనసాగుతున్నాడు. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ (612) అగ్రస్థానంలో ఉన్నాడు.
L.B.W!
— BCCI (@BCCI) September 27, 2024
The Bangladesh Captain departs as @ashwinravi99 strikes soon after Lunch!
Live - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/13ZhY7pIyy
టెస్టు ఫార్మాట్లో ఆసియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
ముత్తయ్య మురళీధరణ్ | శ్రీలంక | 612 |
రవిచంద్రన్ అశ్విన్ | భారత్ | 420* |
అనిల్ కుంబ్లే | భారత్ | 419 |
రంగన హెరాత్ | శ్రీలంక | 354 |
హర్భజన్ సింగ్ | భారత్ | 300 |
Ashwin Test Career : ఇక ఓవరాల్గా కెరీర్లో 102 టెస్టు మ్యాచ్లు ఆడిన అశ్విన్ ఇప్పటివరకు 523 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 37 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్ కూడా అశ్వినే. అనిల్ కుంబ్లే 132 మ్యాచ్ల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కపిల్ దేవ్ (434 వికెట్లు), నాలుగో ప్లేస్లో హర్భజన్ సింగ్(417) ఉన్నారు.
Ind vs Ban Test Series 2024 : రెండో టెస్టులో తొలి రోజు ఆట అర్ధంతరంగా ఆగిపోయింది. వర్షం తీవ్ర ఆటంకం కలిగించడం వల్ల మ్యాచ్ను 35 ఓవర్లకే రద్దు చేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మొమినుల్ హక్ (40 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (6 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
రెండో టెస్టుకు వర్షం బ్రేక్ - 35 ఓవర్లకే ఫస్ట్ డే గేమ్ ఓవర్ - Ind vs Ban 2nd Test