Ashutosh Sharma PBKS : ఇటీవల గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అయితే ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది మాత్రం శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ.
రెండో ఇన్నింగ్స్ లో పంజాబ్ చిక్కుల్లో పడి 150 పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయిందనుకున్న సమయంలో అశుతోష్ క్రీజులోకి వచ్చాడు. మరో 50 పరుగులు చేస్తేనే కానీ, జట్టు గెలుపొందదు. పంజాబ్ అభిమానులందరి కళ్లు అర్ష్‌దీప్ సింగ్ స్ఠానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశుతోష్ పైనే.
తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గుజరాత్ బౌలింగ్ అటాక్‌ను తట్టుకున్నాడు. 3 ఫోర్లు 1 సిక్సుతో చెలరేగి 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అలా శశాంక్ సింగ్ వీర బాదుడుకి తోడు అశుతోష్ శ్రమ కలిసొచ్చింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన తనపై నమ్మకంతోనే ఇంతపెద్ద స్టేజిలో కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పాడు అశుతోష్.
"పంజాబ్ కింగ్స్ జట్టుకు థ్యాంక్స్ చెప్పాలి. గెలిచిన జట్టులో ఆడానని చెప్పుకోవడం చాలా బాగుంది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలోనూ ధావన్ భయ్యా, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. సంజయ్ సార్‌కి కూడా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. చాలా విషయాలు నేర్పించారు. నా సొంత జట్టును గెలిపించగలనని నమ్ముతున్నాను. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అమయ్ ఖురాసియా సార్ నాకెప్పుడూ చెబుతూ ఉండేవారు. అవకాశం వస్తే నువ్వు హీరో అంటుండేవారు" అని గుర్తు చేసుకున్నాడు.
సునాయాసంగా గుజరాత్ గెలుస్తుందనుకున్న తరుణంలో అశుతోష్ శర్మ గేమ్‌ను మలుపుతిప్పాడు. శశాంక్ సింగ్‌తో కలిసి 23 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలా పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేయగలిగింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి ఉండగానే 3 వికెట్ల తేడాతో చేరుకోగలిగి విజయకేతనం ఎగరేసింది.
-
2️⃣ Points ✅
— IndianPremierLeague (@IPL) April 4, 2024
Young guns Shashank Singh and Ashutosh Sharma win it for @PunjabKingsIPL 🙌
They get over the line as they beat #GT by 3 wickets 👍
Scorecard ▶️ https://t.co/0Sy2civoOa #TATAIPL | #GTvPBKS pic.twitter.com/m7b5f8jLbz
పంజాబ్ కింగ్స్ (తుది జట్టు) : శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.
'ఆ ఒక్క తప్పే జట్టు ఓటమికి కారణమైంది' - శుభ్‌మన్ గిల్ - GT VS PBKS IPL 2024
IPLపై పాక్ క్రికెటర్ విమర్శలు- తిప్పికొడుతున్న నెటిజన్లు - Junaid Khan On IPL