ETV Bharat / sports

50 మంది అతిథులకు రూ.100 కోట్ల ఖర్చు - క్రికెటర్లలో అత్యంత ఖరీదైన పెళ్లి ఎవరిదంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 5:18 PM IST

దేశవ్యాప్తంగా ఇప్పుడంతా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రీ వెడ్డింగే ఇంత భారీగా చేస్తున్నారేంటని నొరేళ్లబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సినీ, స్పోర్ట్స్​ సెలబ్రిటీస్​లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి వేడుక ఏంటో తెలుసుకుందాం.

50 మంది అతిథులకు రూ.100 కోట్ల ఖర్చు -  క్రికెట్​లో అత్యంత ఖరీదైన వివాహం ఎవరిదంటే?

Anushka Sharma Virat Kohli Marriage Cost : సెలబ్రిటీల పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్​లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలు, అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న విషయం చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఎంతమందిని పిలిచారు? ఎన్ని కోట్లు ఖర్చు అయింది? ఎన్ని వందల రకాల వంటలు వండారు? నూతన వధూవరులు ఎలాంటి వెడ్డింగ్​ డ్రెస్ వేసుకున్నారు అబ్బో ప్రతీది హాట్​టాపికే అవుతుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో దీన్ని చేస్తున్నారు. దీంతో ప్రీ వెడ్డింగే ఇంత భారీగా చేస్తున్నారేంటని నొరేళ్లబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సినీ, స్పోర్ట్స్​ సెలబ్రిటీస్​లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి వేడుక ఏంటో తెలుసుకుందాం.

50 మంది అతిథులతో రూ.100కోట్లు : ఇండియన్ సినీ, స్పోర్ట్స్​ సెలబ్రిటీస్​లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి విరాట్ కోహ్లీ - అనుష్కది. విరుష్క జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి 2017లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడకకు కేవలం 50 మంది మాత్రమే హాజరయ్యాని సమాచారం. ఈ 50 మంది కోసమే ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది.

ఈ వేడుకలో అనుష్క శర్మ ఖరీదైన పాస్టెల్ లెహంగాను ధరించి ఓ కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టింది. ఇంకా ఈ వేడుకలో ఆమె ధరించిన సబ్యసాచి వెడ్డింగ్ లెహంగా ఒక్కటే రూ. 30 లక్షలు. అలాగే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ తెల్లటి షేర్వాణీ ధరించి ఆకట్టుకున్నాడు. అలా ఈ జంట ధరించిన వెడ్డింగ్​ డ్రెస్స్​లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

800 ఏళ్ల నాటి గ్రామంలో : బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి బోర్గో ఫినోచిటో అనే విల్లాలో జరిగింది. 800 ఏళ్ల నాటి గ్రామాన్నిపునరుద్ధరించి బోటిక్ ప్రాపర్టీగా మార్చారు. దీన్నే బోర్గో ఫినోచిటో విల్లా అని అంటారు. ఇటలీలో ఇది ఉంది. అయితే, ఈ బోర్గో ఫినోచిటోకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఫోర్బ్స్​ ప్రకటించిన ప్రపంచంలోని 20 అత్యంత ఖరీదైన హాలిడే డెస్టినేషన్స్​లో ఇది కూడా ఒకటి. ఈ ఖరీదైన విల్లాల్లో కనీసం వారం పాటు బస చేయాలంటే రూ. 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక రాత్రికి రూ. 6,50,000 నుంచి రూ. 14,00,000 వరకు ధరలు ఉంటాయట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ జంట వివాహానికి సంబంధించి డెకరేషన్​ పనులను దేవికా నారాయణ్ అండ్ కంపెనీకి చెందిన వారు డిజైన్ చేశారంట. ఈ డెకరేషన్ కోసం హోలాండ్​ నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించి మరీ డెకరేట్ చేశారట. అలా ఇన్ని ప్రత్యేకతలతో బాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన వివాహంగా విరుష్క పెళ్లి నిలిచింది. వీరి తర్వాత రెండో ఖరీదైన పెళ్లిగా రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొణె నిలిచారు. వీరి వెడ్డింగ్‌కు రూ. 77-79 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.

అంబానీ ఇంట క్రికెటర్ల సందడి - ప్రీ వెడ్డింగ్ వేడుకలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్!

ఓ ఊపు ఊపేసిన జాన్వీ - అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో డ్యాన్స్ హంగామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.