ETV Bharat / sports

రోహిత్​కు ముంబయి ఇండియన్స్​ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేస్తారా? - Rohith Sharma Nita Ambani - ROHITH SHARMA NITA AMBANI

Rohith Sharma Nita Ambani : టీ20 వరల్డ్ కప్​ 2024 విన్నింగ్​ కెప్టెన్ రోహిత్ శర్మకు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
Rohith Sharma (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 5:39 PM IST

Rohith Sharma Nita Ambani : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్​ అంబానీ ఇంట్లో పెళ్లి పండగ వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. రెండో కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అయితే ఈ వేడుకకు సినీ, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు.

అయితే ఈ వేడుకలో ఓ స్పెషల్ మూమెంట్​ చోటు చేసుకుంది. అదేంటంటే రిలయన్స్​ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​ నీతా అంబానీ వరల్డ్​ కప్​ విన్నింగ్ హీరోలు క్రికెటర్లను స్టేజ్​పై ప్రత్యేకంగా అభినందించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

మరో విషయమేమిటంటే ఐపీఎల్‌లో ముంబయి ఫ్రాంచైజీ నీతా అంబానీకి చెందినదే. అలానే రోహిత్​, హార్దిక్, సూర్య - ఈ ముగ్గురూ ముంబయికే ఆడుతున్నారు. గతంలో ముంబయిని వదిలి గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్​ను వెనక్కి రప్పించి మరీ సారథ్య బాధ్యతలు ఇచ్చారు నీతా. అప్పటివరకు సారథిగా ఉన్న రోహిత్ శర్మను తొలగించి మరీ ముంబయి ఇండియన్స్ కేప్టెన్సీ పగ్గాలను పాండ్యకు అప్పగించారు. కానీ రోహిత్ మాత్రం జట్టును వదలకుండా ప్లేయర్​గా ఆడాడు.

అప్పుడు ఈ వ్యవహారం అంతా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ముంబయి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. నీతా అంబానీతో విభేదాల వల్లే రోహిత్ శర్మను కెప్టెన్సీ హోదా నుంచి తప్పించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత హార్దిక్​ కూడా సారథిగా ఫెయిల్ అయ్యాడు.

అయితే ఇప్పుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో రోహిత్ పట్ల నీతా చూపిన ఆప్యాయత అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. ఇది చూసిన క్రికెట్ ప్రియులు, నెటిజన్లు వారిద్దరి విభేదాలు తొలిగిపోయాయని కామెంట్స్​ చేస్తున్నారు. పైగా హిట్ మ్యాన్ వరల్డ్​ కప్​ గెలుచుని వచ్చాడు, అందుకే నీతా ఆనందంలో అంత ఆప్యాయంగా మాట్లాడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సారి మళ్లీ ముంబయి కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్​కు ఇచ్చేయండి అని అంటున్నారు.

సంగీత్ సెలబ్రేషన్స్​లో స్పెషల్ మూమెంట్ - వరల్డ్ కప్​ విన్నర్స్​కు దిష్టి తీసిన నీతా అంబానీ - Nita Ambani Praises Rohith Sharma

100 అడుగుల ధోనీ కటౌట్‌ - తెలుగు ఫ్యాన్స్ అభిమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.