ETV Bharat / sports

టాస్ పడకుండా కివీస్, అఫ్గాన్ టెస్ట్ రద్దు- 91ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి - NZ vs AFG Test 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 9:35 AM IST

Updated : Sep 13, 2024, 10:20 AM IST

NZ vs AFG Test 2024: న్యూజిలాండ్- అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ రద్దయ్యింది. వర్షం కారణంగా ఐదో రోజూ ఆట సాధ్యపడలేదు.

AFG vs NZ
AFG vs NZ (Source: Associated Press (File Photo))

NZ vs AFG Test 2024: న్యూజిలాండ్ - అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడలేదు. మైదానం చిత్తడిగా మారడం వల్ల మ్యాచ్ తొలి రోజు నుంచి వరుసగా రద్దు అవుతూ వచ్చింది. ఇక ఆఖరి రోజు కూడా వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల ఆట సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

కాగా, 91 ఏళ్ల తర్వాత భారత్‌ వేదికగా ఇలా టాస్‌ కూడా పడకుండానే టెస్టు మ్యాచ్‌ తొలిసారి రద్దు అయ్యింది. 1933 నుంచి భారత్ టెస్టు మ్యాచ్​లకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ 91ఏళ్లలో ఇప్పటివరకు భారత్ వేదికగా 292 మ్యాచ్​లు జరిగాయి. ఇక 147ఏళ్ల టెస్టు చరిత్రలో ఓవరాల్​గా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయిన ఎనిమిదో టెస్టుగా ఈ మ్యాచ్​ రికార్డులకెక్కింది. ఇక వరల్డ్​క్రికెట్​లో 26 సంవత్సరాల తర్వాత టెస్టు మ్యాచ్ రద్దవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1998లో న్యూజిలాండ్- భారత్ (క్యారిస్​బుక్, డునెడిన్) మ్యాచ్ రద్దు అయ్యింది.

భారత్​లోనే ఎందుకు?
ఈ మ్యాచ్​కు అఫ్గాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దేశంలో భద్రతా పరిస్థితుల దృష్యా ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్​ను తటస్థ వేదికగా ఎంపిక చేసింది. ఇక అఫ్గాన్, కివీస్ జట్లు దిల్లీ నుంచి నోయిడాకు ప్రయాణం దగ్గర అవుతుదంన్న ఉద్దేశంతో ఈ స్టేడియాన్ని ఎంచుకున్నారు. అయితే గ్రేటర్ నోయిడా మైదానంలో పిచ్‌ను త్వరగా సిద్ధం చేసేంత సదుపాయాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన మ్యాచ్​లు ఇవే

నెంసంవత్సరం మ్యాచ్ వేదిక ఫలితం
15-08-1890ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్మాంచెస్టర్ మ్యాచ్ రద్దు
208-07-1938ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్మాంచెస్టర్ మ్యాచ్ రద్దు
331-12-1970ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్మెల్​బోర్న్వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్
403-02-1989న్యూజిలాండ్ - పాకిస్థాన్క్యారీస్ బ్రుూక్, డునెడిన్‌వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్
510-03-1990ఇంగ్లాండ్ - వెస్టిండీస్జార్జిటౌన్వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్
617-12-1998న్యూజిలాండ్ - జింబాబ్వేఫైసలాబాద్టాస్​ కూడా పడలేదు
718-12-1998న్యూజిలాండ్ - భారత్ క్యారీస్ బ్రుూక్, డునెడిన్‌ మ్యాచ్ రద్దు
809-09-2024న్యూజిలాండ్- అఫ్గానిస్థాన్ గ్రేటర్ నోయిడా మ్యాచ్ రద్దు

సచిన్ రికార్డుపై విరాట్ కన్ను- బంగ్లా సిరీస్​లో బ్రేక్ అవ్వడం పక్కా! - Virat Kohli Records

టెస్టు సిరీస్​కు బంగ్లా జట్టు ప్రకటన- భారత్​కు రానున్న టీమ్ ఇదే

Last Updated : Sep 13, 2024, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.