ETV Bharat / sports

బీసీసీఐ Vs అఫ్గాన్​ క్రికెట్ బోర్డ్​ - గ్రేటర్‌ నోయిడా స్టేడియంలో ఏం జరుగుతోందంటే? - AFG VS NZ Greater Noida Stadium - AFG VS NZ GREATER NOIDA STADIUM

AFG VS NZ Greater Noida Stadium : నోయిడాలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్వహణ అంశంపై కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులు ఈ మ్యాచ్​ రద్దవ్వగా, మూడో రోజు కూడా ఇరు జట్లు సందిగ్ధంలో పడిపోయాయి. అసలు అఫ్గాన్ బోర్డ్ విమర్శల వెనక కారణం ఏంటంటే?

AFG VS NZ Greater Noida Stadium
AFG VS NZ Greater Noida Stadium (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 11:15 AM IST

AFG VS NZ Greater Noida Stadium : భారత్​లోని నోయిడా వేదికగా సెప్టెంబర్‌ 9 - 13 మధ్య అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు టెస్ట్‌ మ్యాచ్‌లో తలపడాల్సింది. అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా ఉండటం వల్ల టాస్‌ పడకుండానే తొలి రెండు రోజులకు ఆట క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు మూడో రోజు కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అని ప్లేయర్లు సందిగ్ధంలో పడిపోయారు.

అయితే మ్యాచ్​ వేదికగా ఎంచుకున్న గ్రేటర్ నొయిడా స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా లేవని అఫ్గానిస్థాన్‌ బోర్డ్ ఆరోపిస్తోంది. తాగునీరు, విద్యుత్ సరాఫరా లాంటి మౌలిక వసతులు కూడా సక్రమంగా లేదని, అభిమానులు కుర్చునేందుకు సరైన సీట్లు, మహిళలు ఉపయోగించే వాష్‌రూమ్స్‌ లేకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు.

అవి సూచించినా వేరే ఆప్షన్​ లేక ఎంచుకున్నాం
లఖ్‌నవూ, దెహ్రాదూన్ స్టేడియాలు బిజీగా ఉండటం వల్ల అఫ్గాన్‌కు బీసీసీఐ మరో రెండు మైదానాలను సూచించింది. కాన్పూర్‌, లేకుంటే బెంగళూరులో ఏదో ఒక స్టేడియంను ఎంచుకోవాలని అఫ్గాన్‌కు సూచించింది. అయితే, నోయిడా తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన అఫ్గాన్‌ బోర్డు దాన్నే ఎంపిక చేసుకుంది. దిల్లీకి చేరువగా ఉండటం వల్ల తమకు కలిసొస్తుందని అంచనా వేసింది. అయితే ఈ మైదానాన్ని ఎంచుకునే విషయంలో బీసీసీఐ వైపే తప్పు ఉందంటూ అఫ్గాన్ బోర్డ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం వల్ల తాజాగా బోర్డు ప్రతినిధులందరూ యూ టర్న్‌ తీసుకున్నారు. తామే నోయిడాను ఎంపిక చేసుకున్నామంటూ వెల్లడించారు.

"మేం మొదట్లో లఖ్‌నవూ స్టేడియం కోసం అడిగాం. ఆ తర్వాతనే దెహ్రాదూన్​ను రెండో ఆప్షన్​గా ఇవ్వాలని కోరాం. కానీ, బీసీసీఐ మాత్రం మా విజ్ఞప్తులను తిరస్కరించింది. ఆ రెండింటీలోనూ ఆయా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలు టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్నాయని పేర్కొంది. అందుకే మేం వేరే ఆప్షన్​ లేక నోయిడాను ఎంచుకున్నాం. కానీ, నోయిడా కంటే అఫ్గానిస్థాన్‌ స్టేడియంలోనే ఇంకా మంచి వసతులు ఉన్నాయి. మా మౌలిక సదుపాయాలను మేము బాగా మెరుగుపర్చుకున్నాం. కానీ, ఇక్కడ మాత్రం ఎటువంటి మార్పులు లేవని మా కెప్టెన్ షాహిది ఇటీవలె అన్నాడు. ఇప్పుడు చూస్తుంటే అతడు చెప్పింది నిజమని అనిపిస్తోంది" అంటూ ఏసీబీ అధికారి పేర్కొన్నారు.ఈ స్టేడియానికి 'వచ్చేందుకు సిద్ధంగా లేం'అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

డబ్బుల కోసమే ఇదంతా
అయితే ఇప్పుడీ ఈ కాంట్రవర్సీ నడుస్తున్న సమయంలో మరో కొత్త విషయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ నోయిడా అథారిటీ, ఏసీబీకి చెందిన కొందరు వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే సరైన నిర్వహణ లేని స్టేడియంలో ఈ మ్యాచ్‌ని పెట్టినట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

"వాస్తవానికి ఈ స్టేడియం గ్రేటర్ నోయిడా అథారిటీ పరిధిలోకి వస్తుంది. ఆ సంస్థకి చెందిన కొందరు, అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డుకి చెందిన మరికొందరు కలిసి డబ్బులు సంపాదించేందుకే ఈ వేదిక ఎంచుకున్నారు. అయితే, ఉత్తర ప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్‌ (యూపీసీఏ) మాత్రం ఈ విషయమై చాలాసార్లు ఏసీబీతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించింది. అయితే యూపీ టీ20 లీగ్‌ లఖ్‌నవూలో జరుగుతున్న కారణంగా కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ నిర్వహించుకోవడానికి యూపీసీఏ ఓకే చెప్పింది. అయితే ఏసీబీ మాత్రం ఈ ప్రతిపాదనకు స్పందించలేదు" అని ఆ కథనాల్లో రాసుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ విషయంలో ఇరు వర్గాలు స్పందించాల్సి ఉందని క్రికెట్ వర్గాల మాట.

'దీన్ని మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం'- రషీద్ ఎమోషనల్ ట్వీట్ - T20 world cup 2024

అఫ్గానిస్థాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర! - ఎలా అంటే? - T20 Worldcup 2024 Afghanistan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.