ETV Bharat / sports

6 బంతుల్లో 6 సిక్స్​లు- నేపాల్ బ్యాటర్ వరల్డ్​ రికార్డ్- వీడియో చూశారా? - 6 Balls 6 Sixes

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 7:14 PM IST

Updated : Apr 13, 2024, 8:40 PM IST

6 Balls 6 Sixes: నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఆసియా ప్రీమియర్ టోర్నీలో 6 బంతుల్లో 6 సిక్స్​లు నమోదు చేశాడు.

6 balls 6 sixes nepal
6 balls 6 sixes nepal

6 Balls 6 Sixes: నేపాల్​ యంగ్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ప్రపంచ రికార్డ్ సాధించాడు. 2024 ఆసియా ప్రీమియర్ కప్​ టోర్నీలో భాగంగా ఖతార్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో దీపేంద్ర 6 బంతుల్లో 6 సిక్స్​లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ-20 క్రికెట్​లో 6 బంతుల్లో 6 సిక్స్​లు బాదిన మూడో క్రికెటర్​గా దీపేంద్ర రికార్డు కొట్టాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19 ఓవర్లకు 174-7తో నిలిచింది.

అప్పటికి క్రీజులో ఉన్న దీపేంద్ర స్కోర్ 28 పరుగులు (15 బంతుల్లో). ఇక ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో దీపేంద్ర వరుసగా 6 సిక్స్​లు నమోదు చేసి ఔరా అనిపించాడు. దీంతో నేపాల్ 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక టీ20ల్లో టీమ్ఇండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ప్లేయర్ కీరణ్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్​గా దీపేంద్ర నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ మ్యాచ్​లో నేపాల్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఖతార్ నిర్ణీత 20 ఓవర్లలో 178-9కే పరిమితమైంది. దీంతో నేపాల్ 32 పరుగుల తేడాతో మ్యాచ్​లో గెలుపొందింది. మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన దీపేంద్ర సింగ్​కే 'మ్యాచ్​ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Fastest T20 Fifty: టీ20 క్రికెట్​లో తుపాన్ ఇన్నింగ్స్​ ఆడడం దీపేంద్రకు ఇది కొత్తేం కాదు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ అతడి పేరిటే ఉంది. 2023 చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో దీపేంద్ర ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఆసియా క్రీడల్లో మంగోలియాతో మ్యాచ్​లో దీపేంద్ర 9 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్​లో దీపేంద్రతో పాటు కుశాల్ మల్లా (137 పరుగులు, 50 బంతుల్లో), రోహిత్ పౌడెల్ (61 పరుగులు, 27 బంతుల్లో) దెబ్బకు నేపాల్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​లో అత్యధిక స్కోర్ (314-3) నమోదు చేసింది.

ఒకే ఓవర్​లో 6 సిక్సర్లు.. 19 బంతుల్లోనే 83.. టీ10 లీగ్​లో పాండే వీరవిహారం!

Kushal Malla Century : యువరాజ్ రికార్డు బద్దలు.. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. టీ20ల్లో నేపాల్ ట్రిపుల్ సెంచరీ!

Last Updated : Apr 13, 2024, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.