ETV Bharat / sports

2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆ ముగ్గురికి జాక్ పాట్! రూ. కోట్లు ఇచ్చి దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్​! - 2025 IPL Mega Auction

author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 7:50 AM IST

2025 IPL Mega Auction : ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ముగ్గురు వికెట్ కీపర్లు భారీ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. వారెవరంటే?

2025 IPL Mega Auction
2025 IPL Mega Auction (Getty Images)

2025 IPL Mega Auction : భారత్​లో ఐపీఎల్​కు ఉండే క్రేజే వేరు. తమకు నచ్చిన ఫ్రాంచైజీ మ్యాచ్ జరిగితే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. మరికొందరైతే ఆఫీసులో సైతం ఫోన్​లో మ్యాచ్​ను వీక్షిస్తారు. అంతలా ఐపీఎల్ ఫీవర్ ఉంటుంది మరి. అయితే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సారి వేలంలో వికెట్ కీపర్లకు ఫుల్ డిమాండ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు బ్యాటింగ్, కీపింగ్ చేయగల ప్లేయర్ల కోసం వెతుకుతున్నాయట. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు స్టార్ క్రికెటర్లపై అందరి దృష్టి మరలినట్లు తెలుస్తోంది. వీరికి భారీగా చెల్లించైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట. ఇంతకీ వారెవరంటే?

రిషభ్ పంత్ : ది డైనమిక్ ఫోర్స్
రిషబ్ పంత్ ఇప్పటికే ఐపీఎల్​లో తానేంటో నిరూపించుకున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. వికెట్ కీపింగ్ కూడా సమర్థవంతంగా చేయగలడు. ఒంటి చేతితో మ్యాచ్​ను ఈజీగా గెలిపించగల ప్లేయర్లలో రిషబ్ ఒకడు. అందుకే ఈ సారి పంత్ మెగా వేలంలో భారీ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ధోనీ వారసుడి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు పంత్​ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీ క్యాపిటల్స్​ను పంత్ విడిచిపెడితే భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ వర్గాల మాట.

ధ్రువ్ జురెల్ : ది ఎమర్జింగ్ టాలెంట్
యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ ​గత ఐపీఎల్ సీజన్​లోనే తానేంటో నిరూపించుకున్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్​లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్​లో జురెల్ చెలరేగిపోతాడు. మంచి టెక్నిక్​గా ఆడుతాడు. టాప్ లేదా మిడిల్ ఆర్డర్​లో కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం జురెల్​కు ఉంది. అలాగే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అందుకే జురెల్ ఈ ఏడాది జరిగే ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జితేశ్ శర్మ: పవర్ హిట్టర్
జితేశ్ శర్మ ఐపీఎల్​లో పవర్ హిట్టర్​గా పేరొందాడు. డెత్ ఓవర్లలో జితేశ్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తాడు. అలాగే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు జితేశ్. పంజాబ్ వంటి జట్టు జితేశ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్​గా జితేశ్ పనికొస్తాడని పంజాబ్ యాజమాన్యం అభిప్రాయం. అందుకే జితేశ్ కూడా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.

ఒకే జట్టులో రోహిత్, విరాట్, బాబర్ - ఆ టోర్నీలో వీళ్లది సేమ్ టీమ్! - Virat Babar Azam

టీమ్​ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా​ - ఏ జట్టు సంపాదన ఎక్కువ? - India VS Australia Annual Salary

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.