ETV Bharat / sports

విరాట్, పరాగ్ పరుగులు సేమ్- క్యాప్ మాత్రం రియాన్​కే- ఎందుకో తెలుసా? - 2024 IPL Orange Cap - 2024 IPL ORANGE CAP

2024 IPL Orange Cap: రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్ రియాన్ పరాగ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు బాదిన లిస్ట్​లో టాప్​ ప్లేస్ సంపాదించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రియాన్​తో సమానంగా పరుగులు బాదినా క్యాప్ మాత్రం రాజస్థాన్ ప్లేయర్​కే దక్కింది. ఎందుకంటే?

IPL Orange Cap
IPL Orange Cap
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 5:43 PM IST

Updated : Apr 2, 2024, 6:31 PM IST

2024 IPL Orange Cap: 2024 ఐపీఎల్​లో రాజస్థాన్‌ రాయల్స్‌ యంగ్ బ్యాటర్ రియాన్‌ పరాగ్‌ అదరగొడుతున్నాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్​కు గురైన ఈ 24ఏళ్ల ప్లేయర్ ప్రస్తుత టోర్నీలో బ్యాట్​తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో రియాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్​ల్లో వరుసగా 43, 84, 54 పరుగులు నమోదు చేసి, ఆరెంజ్ క్యాప్ రేస్​లోకి దూసుకొచ్చాడు.

ఇప్పటికే ప్రస్తుత సీజన్​లో 181 పరుగులు బాదిన రియాన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అత్యధిక పరుగులు బాదిన జాబితాలో రియాన్​తో సమానంగా (181 పరుగులు) టాప్​లోనే ఉన్నాడు. కానీ, క్యాప్ మాత్రం రియాన్​కే దక్కింది. ఎందుకో తెలుసా?

అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం, టోర్నమెంట్​లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటర్లు అన్నే పరుగులు (Same Runs) చేస్తే, స్ట్రైక్ రేట్ ఆధారంగా తొలి స్థానానికి ప్రియారిటీ ఇస్తారు. ఈ విధంగానే అత్యధిక స్ట్రైక్ రేట్​తో పరుగులు సాధించిన బ్యాటర్లకే ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఈ నేపథ్యంలో విరాట్, రియాన్ పరాగ్ ఇద్దరూ 181 పరుగులు బాదడం వల్ల స్ట్రైక్ రేట్ ఆధారంగా క్యాప్ రియాన్ దక్కించుకున్నాడు. కాగా, రియాన్ 160.18 స్ట్రైక్​ రేట్ నమోదు చేయగా, విరాట్ 141.41 స్ట్రైక్ రేట్​తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మంగళవారం (ఏప్రిల్ 2) ఆర్సీబీ, లఖ్​నవూతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్​లో క్యాప్ చేతులు మారే ఛాన్స్ ఉంది.

ఇక ఇప్పటివరకూ, ఈ టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ల లిస్ట్​లో తొలి రెండు స్థానాల్లో రియాన్, విరాట్ ఉండగా, సన్​రైజర్స్ విధ్వంసకర బ్యాటర్ క్లాసెన్ (167 పరుగులు) మూడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ (137 పరుగులు) నాలుగో ప్లేస్, దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (130 పరుగులు) ఐదో పొజిషన్​లో ఉన్నారు.

ఐపీఎల్‌ 2024 @10 డేస్​ - హిట్ ఫ్లాప్​​ ప్రదర్శనలు ఇవే! - IPL 2024

మయాంక్ మెరుపు వేగంతో లఖ్​నవూ బోణీ - పంజాబ్ ఓటమి - LSG VS PBKS IPL 2024

Last Updated : Apr 2, 2024, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.