ETV Bharat / spiritual

ముక్తిని ప్రసాదించే పవిత్ర కార్తీక స్నానం- దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఇదే! - KARTHIKA SNANAM SIGNIFICANCE

పవిత్ర కార్తీక స్నానంతో ఇహలోకంలో ఆరోగ్యం- పరలోకంలో స్వర్గ సౌఖ్యాలు ఖాయం!

Karthika Snanam
Karthika Snanam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 6:00 AM IST

Karthika Snanam Significance : తెలుగు పంచాంగం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలోని అన్ని రోజులూ పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే! ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే నదీస్నానం అత్యుత్తమం. మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా కార్తీక స్నాన విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్తీక మహాత్యం
కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా, శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతో పాటు, స్నాన, దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. ఈ మాసంలో నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు తప్పకుండా ఆచరించాలని శాస్త్రవచనం.

శ్రీ మహావిష్ణువు జలాంతర్యామిగా
కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. ఈ మాసం మొత్తంలో కుదరని పక్షంలో కనీసం ఒక్కరోజైనా నదీస్నానం చేయాలని శాస్త్రవచనం. అది కూడా వీలుకాని వారు సూర్యోదయానికి ముందే, స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలైన సమస్త నదీజలాలను ఆవాహన చేసుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితమే దక్కుతుంది.

జ్యోతిష శాస్త్రం ఏమి చెబుతోందంటే!
జ్యోతిష శాస్త్రం ప్రకారం- కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాల ఔషధులతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.

కార్తీక స్నానం వెనుక శాస్త్రీయత
మానవ శరీరం ఉష్ణ శక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "ఎలక్ట్రో మాగ్నెటిక్​ యాక్టివిటీ" అంటారు. అందుకే మన పూర్వీకులు ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం.

కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి?
కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది. పైగా బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్న వాళ్లు చలికి ముడుచుకుని పడుకోవడం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే పెద్దలు ఈ నెల రోజులూ ఈ నియమం పెట్టారు.

కార్తీక స్నానంతో ఔషధీ తత్వం
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో వేకువ జామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేస్తే బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. నదులలో స్వచ్ఛమైన నీరుండే సమయం ఇదే! నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉద్ధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. అందుకే స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం.

భక్తి వెనుక శాస్త్రీయత
కార్తీక మాసంలో నదీస్నానం చేయడం వలన సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. మన పూర్వీకులు ఏ నియమాన్ని పెట్టినా దాని వెనుక తప్పకుండా శాస్త్రీయత దాగి ఉంటుంది. దైవభక్తితో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనుకునే వారు, తప్పకుండా కార్తీకమాసంలో నదీస్నానం చేసి భక్తిని ముక్తిని, ఆరోగ్యాన్ని కూడా శివానుగ్రహం ద్వారా పొందవచ్చు.

ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.