ETV Bharat / spiritual

తులసి మాలను ఏ స్వామి భక్తులు ధరిస్తారు? - ఎంతటి పుణ్యం లభిస్తుందో తెలుసా? - Tulsi Mala Benefits

Tulsi Mala Benefits : తులసి మొక్కకు హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే తులసి కోటకు పూజచేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే.. తులసి మాల కూడా ధరిస్తారని మీకు తెలుసా? ఆ మాల ఎవరి భక్తులు ధరిస్తారు? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Tulsi Mala
Tulsi Mala Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:11 PM IST

Tulsi Mala Significance and Rules : హిందూ ధర్మంలో.. తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. అయితే.. తులసి మొక్కను పూజించడం అందరికీ తెలుసు. కానీ.. తులసి మాలను ధరిస్తారని చాలా మందికి తెలియదు. ఈ 'తులసి మాల' హారాన్ని పవిత్రమైన తులసి(Tulsi) మొక్క కాండం నుంచి తయారుచేస్తారు. దీనిని ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి.. ఈ మాల ఏ దేవుడి భక్తులు ఎక్కువగా ధరిస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి? పాటించాల్సిన నియమాలేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎవరు ధరిస్తారు..?

హిందూ పురాణాల ప్రకారం.. తులసి మాల లేదా తులసి జపమాలను శ్రీకృష్ణుని భక్తులు, వైష్ణవులు ధరిస్తారు. ఈ మాలను మెడలో మూడు తంతువులుగా ధరిస్తారు. ఈ దండను విష్ణువు, శ్రీకృష్ణుడికి ప్రియమైనదిగా భావిస్తారు. ఈ మాలను లక్ష్మీదేవి అవతారంగా కూడా భావిస్తారు. తులసి మాల ధరించిన భక్తులు.. భగవంతునికి ప్రియమైన వారుగా ఉంటారని నమ్ముతారు.

తులసి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు :

  • తులసి మాల ధరించడం వల్ల ప్రతికూల శక్తులు, పీడకలలు, ప్రమాదాలు, ఇతర దాడుల నుంచి రక్షణ ఉంటుంద. ఇది ధరించిన వారికి సంపద, అదృష్టం కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు.
  • ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడు తులసి మాల ధరించడం వల్ల.. శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రత పెరుగుతాయట.
  • తులసిలో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని, భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయని వైద్య నిపుణులు కూడా చెబుతారు.
  • తులసి మాల ధరించడం వల్ల నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి, ఆందోళన స్థాయిలు తగ్గుతాయట.

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కులో పెడితే లక్ష్మీ కటాక్షం! అదృష్టం మీ వెంటే!

తులసి మాల ధరించడానికి నియమాలు :

  • తులసి మాల ధరించేవారు ముఖ్యంగా నాలుగు సూత్రాలకు కట్టుబడి ఉండాలని పండితులు చెబుతున్నారు.
  • మాంసాహారం, జూదం, మత్తు, అక్రమ లైంగిక సంబంధాలు. అనే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • తులసి మాల ధరించాలనుకునే భక్తులు టీ, కాఫీలకు సైకతం దూరంగా ఉండాలని చెబుతున్నారు.
  • అలాగే ఈ మాల ధరించాలనుకునే వారు.. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఉపయోగించిన ఆహారాన్ని తీసుకోకూడదట.
  • అన్నిటికన్నా ప్రధానమైన విషయమేమిటంటే.. ఈ మాలను ఒకసారి ధరిస్తే ఎప్పటికీ తీసివేయకూడదట!
  • ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేవారు మాత్రమే తులసి మాల ధరించాలని సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తుల‌సి నీళ్లు రోజూ తాగితే.. అందం, ఆరోగ్యంతో పాటు బోలెడు ప్ర‌యోజ‌నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.