ETV Bharat / spiritual

వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం! - ఈ రంగు విగ్రహాన్ని అసలే తీసుకోవద్దు! - vinayaka chavithi 2024 - VINAYAKA CHAVITHI 2024

Ganesha Trunk: వినాయక చవితి పండగను అందరూ ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గణపతి మండపాలు మామిడి ఆకులు, పూలతో అందంగా ముస్తాబవుతాయి. అయితే, వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Which Side Ganesha Trunk is Good
Which Side Ganesha Trunk is Good (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 2, 2024, 12:51 PM IST

Which Side Ganesha Trunk is Good: వినాయక చవితి వస్తుందంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతీ వాడలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పార్వతీ తనయుడికి మొక్కుతారు. ఇక వినాయక చవితి సమయంలో ఎక్కడ చూసినా గణపతి మండపాలతో సందడి నెలకొంటుంది. పచ్చని మామిడి ఆకులు, పూలతో ఘనంగా గణపతికి పూజలు చేస్తారు. అలానే కేవలం వీధుల్లో కాకుండా చాలా మంది ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేస్తారు. అయితే, వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో గణపతిని పూజించే ముందు ఆ సూచనలు ఏంటో తెలుసుకోండి.

విగ్రహ తొండం ఆ వైపునకు వంగి ఉండాలట: మనం ఇంట్లో లేదా మండపాల్లో ప్రతిష్ఠించుకునే వినాయకుడి విగ్రహ తొండం వినాయకుడికి ఎడమ వైపునకు వంగి ఉండాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదమని.. దీన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ధన లాభం చేకూరుతుందని వివరిస్తున్నారు. దీంతోపాటు గణపతిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహాన్ని తీసుకుంటే మంచిదని తెలుపుతున్నారు. నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని సూచిస్తున్నారు.

ఆ రంగు విగ్రహాలను తీసుకోకూడదట!: అదే విధంగా వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులు కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా మంది విగ్రహాలు ఆకర్షణీయంగా ఉండాలనే భావనతో ప్రకృతికి నష్టం కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. అయితే, ఆకర్షణీయంగా ఉన్న రంగురంగుల విగ్రహాలను కొనాలన్న ఉద్దేశంతో నలుపు రంగు ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని వివరిస్తున్నారు.

మట్టి బొమ్మలను వాడాలి: విగ్రహం చిన్నదైనా, పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమమని చెబుతున్నారు. మట్టి అనేది పంచభూతాల్లో ఒకటి.. కాబట్టి దాంతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వివరిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తూ విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి అదృష్టం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు.

తిరుమల భక్తులకు శుభవార్త- శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి- ఎప్పటి నుంచో తెలుసా? - Tirumala Pushkarini Open

పోలాల అమావాస్య : ఈ రోజున ఈ పరిహారాలు పాటిస్తే - జన్మజన్మల దోషాలన్నీ తొలగి ఐశ్వర్యం లభిస్తుంది! - Polala Amavasya 2024 Remedies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.