Best Place to Keep Money Plant As Per Vastu : ఇళ్లల్లో చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నారు. ఇవి ఇంటికి అందాన్ని.. మనసుకు ఆనందాన్నీ అందిస్తాయి. అయితే.. ఇంట్లో మనీ ప్లాంట్(Money Plant) పెంచడం వల్ల సిరిసంపదలు కలిసివస్తాయని చాలా మంది నమ్ముతారు. తమకు ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ పెంచుతుంటారు. కానీ.. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచడానికి ఒక దిశ ఉందట. అలా కాకుండా ఎక్కడబడితే అక్కడ పెంచితే ప్రతికూల ప్రభావాలూ చూపే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ.. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచడానికి సరైన దిశ ఏదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం.. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఉంచకూడదట. ఎందుకంటే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ దిశ బృహస్పతిని సూచించడంతో పాటు శుక్రుడికి శత్రువుగా పరిగణించబడుతుందట. అందుకే.. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ఉంచితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలు, కెరియర్ సమస్యలు, కుటుంబ ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.
అదేవిధంగా.. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను పడమర, తూర్పు దిశలలో నాటడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. అశుభం అంటున్నారు. ఈ దిశలో నాటడం వల్ల మానసిక ఒత్తిడికి గురికావల్సిన వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. నిజానికి చాలా మంది మనీ ప్లాంట్ నాటేటప్పుడు దిశ ప్రాముఖ్యతను విస్మరిస్తారు. ఫలితంగా పొందే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వాస్తుప్రకారం మనీ ప్లాంట్‌ను సరైన దిశలో పెంచడం చాలా ముఖ్యమంటున్నారు.
మనీ ప్లాంట్ పెంచడానికి సరైన దిశ ఏంటంటే?
వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ పెంచడానికి అత్యంత కచ్చితమైన దిశ ఆగ్నేయమని వాస్తునిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ మొక్కకు ఇది అత్యంత అనుకూలమైన దిశ. ఎందుకంటే ఈ దిశలో విఘ్నాలను తొలగించే వినాయకుడి ఉంటాడట. అలాగే ఈ దిశ శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది. అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచాలని చెబుతారు. ఇక్కడ పెంచితే.. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోవద్దు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన మనీ ప్లాంట్ ఎప్పటికీ ఎండిపోకుండా చూసుకోవాలట. ఈ మొక్క ఎండిపోతే ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని విశ్వసిస్తారు. అందుకే.. దీన్ని నివారించడానికి ఈ ప్లాంట్‌కు క్రమం తప్పకుండా నీరు పోస్తూ దాని ఎండిన ఆకులను వెంటనే తొలగిస్తుండాలి.
ఆకులు నేలను తాకొద్దు : మనీ ప్లాంట్ చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే అది పెరిగే కొద్దీ భూమికి చేరుతుంది. అయితే మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా నేలను తాకకుండా చూసుకోవాలట. వాస్తు ప్రకారం ఇలా నేలను తాకటం మంచిది కాదట.
వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే!