ETV Bharat / spiritual

మీరు చేపట్టే పనులు విజయవంతం అవ్వాలంటే - వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా? - WHICH COLOUR TO WEAR ON SEVEN DAYS

-దురదృష్టం వీడి అదృష్టం పట్టాలంటే ఇవి ధరించాలట -12 రాశుల వారికి కలిసొచ్చే రంగులు ఏంటో చెబుతున్న నిపుణులు

LUCKY COLOURS FOR EACH DAY OF WEEK
Which Colour to Wear on Which Day (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 13, 2024, 2:54 PM IST

Which Colour to Wear on Each Day of the Week as Per Astrology: ఏ పని చేస్తున్నా కలిసి రాకపోయినా.. తమను దురదృష్టం వెంటాడడం వల్లే పనులు విజయవంతం కావడం లేదని బాధపడుతుంటారు చాలా మంది. అయితే, అలాకాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తూ.. మీరు చేపట్టిన పనులు విజయవంతం కావాలంటే కలరాలజీని బట్టి రోజూ ధరించే దుస్తుల రంగుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ.. కలరాలజీ ప్రకారం 12 రాశుల వారికి వారం రోజుల్లో కలసి వచ్చే రంగులు ఏంటి? కలసిరాని రంగులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆదివారం : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి, ఏ నక్షత్రం వారైనా ఈరోజు లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. ఈరోజు కాషాయ(ఆరెంజ్) రంగు వస్త్రాలు ధరించడం విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తుందంటున్నారు. అదే.. పసుపు, తెలుపు రంగులను ధరిస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయంటున్నారు. ఇకపోతే.. నలుపు, నీలం, ముదురు ఆకుపచ్చ రంగువి ధరించడం దురదృష్టాన్ని ఇస్తుందట.

సోమవారం : ఈరోజు తెలుపు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమట. అదే.. పసుపు రంగు దుస్తులు ధరిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే.. ముదురు ఎరుపు(డార్క్ రెడ్), నలుపు లేదా ముదురు నీలం రంగులు ధరిస్తే ఈ రోజు కలిసిరాదట.. అలాగే ఇవి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయంటున్నారు.

మంగళవారం : ముదురు ఎరుపు ధరించడం వల్ల ఈరోజు బాగా కలసివస్తుందట. అదే.. వెండి లాంటి తెల్లటి రంగు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తుందంటున్నారు. మంగళవారం ముదురు పచ్చవి, ముదురు నీలం ధరిస్తే.. ఈరోజు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.

బుధవారం : ఈరోజు ముదురు ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవడం బాగా కలసివస్తుందంటున్నారు. అదే.. ముదురు నీలం, నలుపు రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట. బుధవారం ఎరుపు అంతగా కలసిరాదంటున్నారు. అలాగే.. తెలుపు, పసుపువి ఈరోజు ధరించకపోవడమే మంచిదట.

గురువారం : ఈరోజు బాగా కలసిరావాలంటే పసుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిదట. అదే.. ముదురు నీలంవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయంటున్నారు. ఇకపోతే గురువారం ముదురు ఎరుపు, లేత ఎరుపు వస్త్రాలు అంత కలసిరావట.

శుక్రవారం : వెండి లాంటి తెలుపు కలర్ ధరిస్తే ఈరోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. అదే.. ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం మిశ్రమ ఫలితాలను కలిగిస్తాయట. ఇకపోతే శుక్రవారం.. పసుపు కలర్ అంతగా కలసిరాదట. అలాగే.. ముదురు ఎరుపు ఈరోజు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు.

శనివారం : ఈరోజు బాగా కలసివచ్చే కలర్​గా బ్లాక్​ని చెప్పుకోవచ్చంటున్నారు. అదే.. వెండి లాంటి తెలుపు, ముదురు నీలం రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట. ఇక శనివారం ఎరుపు రంగు అంతగా కలసిరాదంటున్నారు. అలాగే.. పసుపు రంగు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.

కాబట్టి.. 12 రాశులవారు, 27 నక్షత్రాల వారు, ఏ తేదీలో జన్మించిన వారైనా సరే.. వారంలో వచ్చే ఏడు రోజుల్లో కలరాలజీని బట్టి ఏ రంగు కలసివస్తుందో ఆ రోజు ఆ రంగు వస్త్రాలు ధరించడం లేదా ఆ రంగు కర్చీఫ్​ని దగ్గర పెట్టుకోవడం చేయాలంటున్నారు. అలాగే.. చెడు ఫలితాలను కలిగించే వాటిని వీలైనంత వరకు వాడకుండా చూసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

కలలో జంతువులు కనిపిస్తున్నాయా? - ఇది దేనికి సంకేతమో మీకు తెలుసా?

'ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖం చూడాలో మీకు తెలుసా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.