ETV Bharat / spiritual

ఈ వారం ఈ రాశివారికి కలిసి వచ్చే అవకాశం - రాజకీయ నాయకులకు అఖండ విజయమే! - Weekly Horoscope

Weekly Horoscope From June 2nd to June 8th 2024 : 2024 జూన్​ 2వ తేదీ నుంచి జూన్​ 8వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 4:57 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From June 2nd to June 8th 2024 : 2024 జూన్​ 2వ తేదీ నుంచి జూన్​ 8వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో వృత్తి, వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. మీ వృత్తికి మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత గొప్ప విజయం సాధిస్తారు. రాజకీయనాయకులు వారం చివరకు ముఖ్యమైన పదవి లేదా బాధ్యతలు చేపడతారు. వ్యాపారులకు వారం ప్రారంభంలో ఆశించిన ప్రయోజనాలు లేకపోయినా చివరలో మంచి లాభాలను అందుకోవడమే కాకుండా, సంస్థను అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రత్యర్థులు లక్ష్యం నుంచి మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారులకు వారం మొదటి భాగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపార రంగాల వారు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. మారుమూల ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల కొంత నిరుత్సాహంగా ఉంటారు. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అవసరం. సంతానానికి సంబంధించిన శుభవార్తలతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు దైవబలంతో అనుకున్నది సాధించగలుగుతారు. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూస్తారు. వ్యాపారులకు బిజినెస్​లో డబ్బులు ఆగిపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో అనుకోని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. హనుమాన్ చాలీసా పరాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్తులతో కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు ఉండవు. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార నిపుణులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో తప్పకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల మధ్య పూర్వీకుల ఆస్తి విషయంలో విబేధాలు రావచ్చు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే అదనపు శ్రమ అవసరం. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పిల్లల భవిష్యత్ పట్ల ఆందోళన నెలకొంటుంది. రాజకీయ నాయకులు ఆశించిన ఫలితాలు పొందటానికి అవకాశం ఉంది. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోవద్దు. నిరాశను వీడి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంటి అవసరాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. వ్యాపారులకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆర్ధిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. విద్యార్థులు చదువు పట్ల నిరాసక్తత చూపుతారు. రాజకీయ నాయకులకు ఫలితాలు నిరాశాజనకంగా ఉండవచ్చు. శివారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. లేకుంటే పనులకు ఆటంకాలు కలుగవచ్చు. వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే విద్యార్థులు తీవ్రమైన కృషి చేయాల్సి ఉంటుంది. కీలమైన వ్యక్తులతో సమావేశమవుతారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ, జీతం పెరుగుదల, ప్రమోషన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ నాయకులు అఖండ విజయాన్నిసాధిస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రంగాలవారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. వ్యాపారులు స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకు శుభసమయం నడుస్తోంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సంబంధాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. భూతగాదాలు, ఆస్తి వ్యహారాలు కోర్టు బయట పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటే మేలు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పనిలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో పరపతి పెరుగుతుంది. శని స్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా అవసరం. రాజకీయనాయకులు దైవబలంపై విశ్వాసం ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. లేకపోతే భారీ నష్టాలు ఉండవచ్చు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాల కోసం తీవ్రంగా శ్రమించాలి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలలో చోరభయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారం చివరలో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులకు ఆశించిన మేర ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. గణపతి షోడశ నామాలు ప్రతిరోజూ చదువుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.