ETV Bharat / spiritual

అప్పుల బాధలా? శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే ప్రాబ్లమ్స్ క్లియర్​! - Venkateswara Swamy Puja - VENKATESWARA SWAMY PUJA

Venkateswara Swamy 7 Saturday Vratham Benefits : శనివారం చాలా మందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు. అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Venkateswara Swamy 7 Saturday Vratham Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 6:29 PM IST

Venkateswara Swamy 7 Saturday Vratham Benefits : జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి పెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే! పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాలపాటు చేయాల్సి ఉంటుంది.

ఏడు శనివారాల వ్రత పూజా విధానం
శనివారం తెల్లవారుజామునే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ, విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి.

వడ్డికాసులవానికి ముడుపుల మూట
వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి.

పిండి దీపాలు
ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందురోజు రాత్రి పావుశేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటిరోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో, కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి.

ఏడు కొండలవాడికి ఏడు ఒత్తుల దీపం
Venkateswara Swamy Pooja Vidhanam : పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి, ఆవు నేతితో వేంకటేశ్వరస్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవింద నామాలు చదువుకోవాలి. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి, శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి, నీరాజనాలు ఇవ్వాలి.

వ్రతం చేసే వారు ఈ నియమాలు పాటించాలి
వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్ధాలనే భుజించాలి. మధ్యాహ్నం ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి ఫలహారం తీసుకోవచ్చు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి.

వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం
ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడుకొండలవాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కి పోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది.

శనివారం వ్రత మహత్యం
ఏడు శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి, అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు, అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కోరికలు తీర్చే కామదా ఏకాదశి- శుక్రవారం ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్యం! - Kamada Ekadashi Significance

పనుల్లో అడ్డంకులు వస్తున్నాయా? గురువారం ఈ దేవతను పూజిస్తే పరిష్కారం! - thursday pooja benefits in telugu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.