Vastu Tips to Retain Positivity in Home : మెజారిటీ జనం.. తాము ఏ నిర్మాణం చేపట్టినా కచ్చితంగా వాస్తు చూస్తారు. అయితే.. తెలిసీ తెలియక చేసే పనుల వల్ల వాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉంటుందట. దానివల్ల ఇంట్లోకి నెగెటివ్ శక్తులు చొరబడి, ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ పరిస్థితి రాకుండా 6 వాస్తు టిప్స్(Vastu Tips) తప్పక పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాల్ట్ క్లెన్సింగ్ : మీ ఇంట్లో పాజివిటీ ఎనర్జీని నింపడంలో సాల్ట్ క్లెన్సింగ్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అందుకోసం మీరు ప్రతి గది మూలల్లో చిటికెడు ఉప్పును ఉంచి ఒక రోజు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పురాతన వాస్తు విధానం ప్రతికూల శక్తిని గ్రహించి, మీ నివాసం నుంచి బయటకు పంపుతుందట.
ఇంటి క్లీనింగ్ : మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. ఇలా చేయడం ద్వారా మీ నివాసంలో పాజిటివిటీ పెరుగుతుంది.
అద్దాలను అలా ఉంచకండి : ఇంట్లో అద్దాలు పాజిటివ్ ఎనర్జీని ప్రతిబింబిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే.. ఆ ఎనర్జీ తిరిగి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఈ పొరపాటు చేయకూడదు. అదేంటంటే.. మీ ఇంటి ప్రవేశ ద్వారం ముందు అద్దాలను ఎప్పుడూ ఉంచకూడదట.
Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!
విండ్ చైమ్స్ : ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి.. గడపకు దగ్గరగా విండ్ చైమ్‌లను వేలాడదీయండి. ఇలా చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా టింకరింగ్ చైమ్‌లు ప్రతికూల శక్తులను తరిమికొట్టి మీ ఇంట్లో పాజిటివీటిని పెంపొందించగలవని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయంటున్నారు.
వెదురు మొక్క: ఇదీ ఇంట్లో పాజిటివిటీని పెంపొందించి అదృష్టాన్ని తీసుకురావడంలో చాలా బాగా పని చేస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. వెదురు అదృష్టానికి సంకేతం. వెదురు మొక్కను మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచాలని చెబుతున్నారు. ఫలితంగా అదృష్టం మీ తలుపు తట్టడంతో పాటు మీరు చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుందట.
నెమలి ఈకలు : ఇవి మీ ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా.. పత్రికూల శక్తులను ఇంటి నుంచి పారదోలడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని ఇంట్లో ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపుతుంది.
ప్రార్థన/ధ్యానం : ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోయి పాజిటివ్ ఎనర్జీ నిండాలంటే.. అన్నింటికన్నా ముందు మీరు చేయాల్సిన మొదటి పని.. రోజూ ఉదయాన్నే ప్రార్థన లేదా ధ్యానం చేయడం. ముఖ్యంగా భగవంతుని దగ్గర దీపం లేదా ధూపం వెలిగించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుందంటున్నారు వాస్తు నిపుణులు. ఇవి పాటిస్తే.. ఇంట్లో ఆనందం కొలువుంటుందని సూచిస్తున్నారు.
మీ ఇంట్లో తరచూ గొడవలా? - వాస్తు సమస్య కారణం కావొచ్చు - ఇలా చేస్తే అంతా సెట్!
గుమ్మం వద్ద ఇవి పెడుతున్నారా? ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చొరబడుతుందట!