ETV Bharat / spiritual

మీ పిల్లలు మంచి మార్కులు సాధించాలంటే - వాస్తు ప్రకారం ఇలా చేయండి! - Vastu Tips For Exams - VASTU TIPS FOR EXAMS

Vastu Tips For Success In Exams : మన దేశంలో మెజార్టీ జనాలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. అన్ని విషయాల్లోనూ వాస్తు పాటిస్తారు. వాస్తు బాగుంటేనే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో.. పిల్లలు మంచి మార్కులతో పాస్‌ కావాలంటే కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips For Success In Exams
Vastu Tips For Success In Exams
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 10:37 AM IST

Vastu Tips For Success In Exams : చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్‌ పేరు ఎత్తగానే అమ్మో అని భయపడి పోతుంటారు. ఎంతో భయంగా ఎగ్జామ్‌ హాల్‌లోకి వెళ్లి ఊపిరి బిగపట్టి పరీక్షలు రాస్తుంటారు. నిజానికి ఏ పరీక్షలో అయినా కూడా ప్రశ్నలు వారు ఇంతవరకూ స్కూల్లో నేర్చుకున్నవి, చదువుకున్నవే ఉంటాయి. అయినా కూడా ఎక్కువ మంది పిల్లలు పరీక్షలనగానే జంకుతుంటారు. అయితే, ఇలా పరీక్షలనగానే ఎంతో భయపడిపోయే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని వాస్తు నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల వారిలో ఉన్న భయం తొలగిపోయి ధైర్యంగా పరీక్షలు రాస్తారని అంటున్నారు. అలాగే మంచి మార్కులతో పాస్ కూడా అవుతారని పేర్కొన్నారు. మరి, పిల్లలు ఎగ్జామ్స్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ మార్కులతో పాస్‌ అవ్వడానికి పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు ఎగ్జామ్స్‌ బాగా రాయాలంటే వాస్తు ప్రకారం ఇలా చేయండి :

  • వారు చదువుకోవడానికి ఒక స్టడీ రూమ్‌ను ఇంట్లో ఏర్పాటు చేయాలి. వాస్తు ప్రకారం ఈ గది తూర్పు లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • ఈ స్టడీ రూమ్‌లో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. పగటి వేళలో ధారాళంగా సూర్యుడి కాంతి ఉంటే ఇంకా మంచిదని అంటున్నారు. దీనివల్ల వారిలో చదవాలనే సంకల్ప బలం మరింత పెరుగుతుందట.
  • ఈ గదికి వాస్తు ప్రకారం లైట్‌ గ్రీన్‌, బ్లూ, యెల్లో, వైట్ వంటి కలర్‌లు వేస్తే మంచిది. ఈ కలర్‌లు వారిలో ఏకాగ్రతను పెంచుతాయి.

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

  • అలాగే పిల్లలు చదువుకునే టేబుల్‌ దీర్ఘ చతురస్రాకారంలో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
  • వారి స్టడీరూమ్‌లో సరస్వతీ దేవి, గణపతి దేవుళ్ల ఫొటోఫ్రేమ్‌లను ఏర్పాటు చేయాలి. దీంతో వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.
  • పిల్లలకు పరీక్షల సమయం దగ్గర పడినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో టీవీ, మ్యూజిక్‌ సిస్టమ్‌ వంటి వాటిని పూర్తిగా ఆఫ్‌ చేయాలి. వీటితో వారి ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • అలాగే వారు పరీక్షకు వెళ్లేటప్పుడు పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగించండి. దీనివల్ల వారు ప్రశాంతంగా పరీక్షలు రాస్తారని నిపుణులు చెబుతున్నారు.
  • ఇంకా పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు గాయత్రీ మంత్రాన్ని పఠించమని చెప్పండి.
  • ఈ మంత్రాన్ని ఎగ్జామ్స్‌ టైమ్‌లో పఠించడం వల్ల వారిలో ఉన్న భయం మొత్తం తొలగిపోయి, ధైర్యం వస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని వాస్తు నిపుణులంటున్నారు.

గాయత్రీ మంత్రం

ఓమ్‌ భూర్‌ భువః సువః తత్‌ సవితుర్‌ వరేణ్యం

భర్గో దేవస్య ధీమహీ

ధియో యోనః ప్రచోదయాత్‌!

  • చివరిగా సాధారణంగానే పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ సమయంలో పేరెంట్స్‌ తరచూ చదవమని తిట్టకుండా, మంచి అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

మీ పిల్లలు బుక్స్ ముట్టుకోవట్లేదా? - ఇలా చేయండి ఇష్టంగా చదువుతారు!

మీ పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టడం లేదా ? - అయితే వాస్తు ప్రకారం ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.