ETV Bharat / spiritual

వాస్తుప్రకారం మనీ ప్లాంట్​కు ఈ వస్తువు కడితే - ఆర్థిక సమస్యలన్నీ పరార్​! - Vastu Tips for Money Plant - VASTU TIPS FOR MONEY PLANT

Money Plant Vastu Tips : స్వచ్ఛమైన గాలి.. ఇంటికి అందాన్నివ్వడం.. కాలక్షేపం.. కారణమేదైతేనేం చాలా మంది ఇళ్లల్లో మొక్కల పెంపకం సాధారణమైపోయింది. ముఖ్యంగా.. ఎక్కువ మంది ఇళ్లల్లో మనీప్లాంట్ కనిపిస్తోంది. ఈ మొక్క పెంచడం వల్ల సిరిసంపదలు కలిసివస్తాయని నమ్ముతారు. అయితే, వాస్తుప్రకారం మనీ ప్లాంట్​కు ఇది కడితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపన్నులవుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

VASTU TIPS FOR MONEY PLANT
Money Plant Vastu Tips (ఈటీవీ భారత్ ప్రత్యేకం)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 12:32 PM IST

Vastu Tips for Money Plant : ఇంట్లో ఉంటే అదృష్టం అని కొందరూ, పచ్చదనంకోసం మరికొందరూ, ఇంటి అందంకోసం ఇంకొందరూ... మొత్తం మీద ఈ మధ్యకాలంలో దాదాపు అందరి ఇళ్లలో మనీప్లాంట్‌ కనిపిస్తోంది. ఎవరే కారణంతో మనీ ప్లాంట్​ను పెంచినా ఆ మొక్క వాతావరణంలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని అందిస్తుందన్నది మాత్రం వాస్తవం. అంతేకాదు.. ఈ మనీ ప్లాంట్​కు వాస్తుశాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్(Money Plant) ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తెస్తుందని, ఇంటి ఆనందం, ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.

అయితే, ఇవన్నీ జరగాలంటే వాస్తుప్రకారం మనీ ప్లాంట్ విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందులో ముఖ్యంగా మనీ ప్లాంట్​కు ఈ వస్తువు కడితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని, సంపద అమాంతం పెరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ, వాస్తుప్రకారం.. మనీప్లాంట్ విషయంలో పాటించాల్సిన నియమాలేంటి? ఏ వస్తువు కడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనీ ప్లాంట్ నాటడానికి సరైన దిశ : వాస్తుశాస్త్రం ప్రకారం మనీప్లాంట్​ను ఇంట్లో సరైన దిశలో నాటడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుందంటున్నారు. వాస్తుప్రకారం మనీ ప్లాంట్​ను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో పెంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది మనీ ప్లాంట్​కు అత్యంత అనుకూలమైన దిశ అని చెబుతున్నారు. ఎందుకంటే.. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఈ దిక్కులోనే నివసిస్తాడట. అలాగే.. ఈ దిశ శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది. అందుకే ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్​ పెంచితే.. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద పెరుగుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే మనీ ప్లాంట్ పెంపకం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే!

నేలను తాకకుండా చూసుకోవాలి : ఇతర మొక్కల్లా మనీప్లాంట్‌ పెరగడానికి ప్రత్యేకంగా స్థలం అక్కర్లేదు. బెడ్‌రూమ్‌ కిటికీలోనో డైనింగ్‌టేబుల్‌ మీదో.. ఎక్కడ పెట్టినా వేగంగా పెరుగుతుంది. ఈ మొక్కను లక్ష్మీదేవి రూపంగా విశ్వసిస్తారు. కాబట్టి, మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే తీగలు పైకి, పక్కలకు వెళ్లేలా తాడు సహాయంతో కట్టాలి. ఎందుకంటే వాస్తుప్రకారం.. పెరుగుతున్న తీగలు పెరుగుదల, శ్రేయస్సుకు చిహ్నం భావిస్తారు.

అదేవిధంగా వాస్తుప్రకారం.. ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో మనీ ప్లాంట్ నాటుకోవాలి. ఎందుకంటే అది ఇంట్లో శ్రేయస్సును తెస్తుందంటున్నారు వాస్తు నిపుణులు. అలాగే ఎప్పుడూ ఈ మొక్కను నేలపై నాటకూడదంటున్నారు. ఎందుకంటే దాని ఆకులు నేల వైపు పెరుగుతాయి. ఫలితంగా ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు.

ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మనీ ప్లాంట్​కు ఏం కట్టాలంటే? వాస్తుప్రకారం.. మనీ ప్లాంట్​కు శుక్రవారం ఎర్రటి దారం కట్టడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కట్టడం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండుతుందంటున్నారు. కాబట్టి మనీప్లాంట్​కు శుక్రవారం ఎర్రటి దారం కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖ, సంతోషాలు చేకూరుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుందని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే - సమ్మర్​లో హీట్​ తగ్గి కూల్​ కూల్​గా ఉంటుంది! - Indoor Plants for Summer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.