ETV Bharat / spiritual

వాస్తు : మెయిన్ డోర్ ఇలా మెయింటెయిన్ చేయకపోతే - మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందట! - Main Door Vastu Tips - MAIN DOOR VASTU TIPS

Main Door Vastu Tips : ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలంటే.. మెయిన్ డోర్ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని పనుల్లోనూ లాభాల పంట పండుతుందని చెబుతున్నారు. మరి, మెయిన్ డోర్ విషయంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips for Main Door
Main Door Vastu Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 11:03 AM IST

Vastu Tips for Main Door : చాలా మంది ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక వరకు వాస్తును బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లోని ప్రధాన ద్వారమైన మెయిన్ డోర్​ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను తప్పక పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మెయిన్ డోర్ విషయంలో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా వాస్తుదోషాలు తలెత్తి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందంటున్నారు. అలా జరగొద్దంటే.. మెయిన్​డోర్ విషయంలో​ ఈ వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. తద్వారా.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని.. మీ ఇల్లు ఎలాంటి గొడవలు లేకుండా ఆనందమయంగా మారుతుందంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ.. ప్రధాన ద్వారం(Main Door) ఎలా ఉంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మామిడి ఆకులు వేలాడదీయాలి : ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే అందుకు వాస్తుదోషం కూడా కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇలాంటి టైమ్​లో ఇంటి ప్రధాన ద్వారానికి పూలు కట్టాలని చెబుతుంటారు. అదేవిధంగా మెయిన్ డోర్​కు మామిడి ఆకులను కట్టడం కూడా ఇంటికి మేలు జరుగుతుందంటున్నారు. అలాగే.. తలుపు మీద దేవుని ఫోటోను చెక్కించడం లేదా అతికించడం మంచిది అంటున్నారు. ఇలా ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్‌ ఎనర్జీ నిండి ఉంటుందని తెలియజేస్తున్నారు.

రెండు చేతులతో డోర్ ఓపెన్ చేయండి : ఈరోజుల్లో చాలా మంది ఇంటి ప్రవేశ ద్వారాలకు రెడిమేడ్ డోర్స్ యూజ్ చేస్తున్నారు. అలాకాకుండా మెయిన్ డోర్​ను సీసం లేదా వేప, గంధం వంటి చెక్కతో తయారుచేయించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు. అదేవిధంగా, వాస్తుప్రకారం.. ఇంటికి వచ్చినప్పుడల్లా రెండు చేతులతో డోర్ ఓపెన్ చేయడం మంచిది అంటున్నారు.

వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే!

డోర్ ఎల్లప్పుడూ తెరిచి ఉంచకూడదు : వాస్తుప్రకారం మెయిన్ డోర్ ఎప్పుడూ ఓపెన్​లో ఉండడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే ఎప్పుడూ ఎలా ఓపెన్​లో ఉంటే సంపద ఇంటి నుంచి వెళ్లిపోతుందట. అందుకే మెయిన్​డోర్ ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉండేలా చూసుకోవాలంటున్నారు.

శుభ్రంగా ఉండాలి : ఇంట్లోకి వచ్చే ముందు ఎవరైనా మెయిన్‌ డోర్‌ను కచ్చితంగా చూస్తారు. కాబట్టి, అది ఎప్పుడూ తళతళ మెరిసేలా ఉండేలా చూసుకోవాలట. అలాగే దెబ్బతిన్న తలుపులు ఉంటే వెంటనే మార్చాలని సూచిస్తున్నారు.

సైజ్‌ పెద్దగా ఉండేలా చూసుకోవాలి : ఇంట్లో ఉన్న రూమ్‌ల ఆధారంగా మనం తలుపులు ఏర్పాటు చేసుకుంటాం. అయితే.. ఇంట్లో ఎన్ని తలుపులు ఉన్నా సరే ఇంటి ప్రధాన ద్వారం తలుపు మాత్రం మిగతా అన్నింటికన్నా పెద్దగా ఉండాలని వాస్తు నిపుణులంటున్నారు. దీని వల్ల ఇళ్లంతా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ కలుగుతాయని సూచిస్తున్నారు. ఇలా మెయిన్ డోర్ విషయంలో పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందంటున్నారు. ఫలితంగా అంతా మంచే జరుగుతుందంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఎంత కష్టపడ్డా ఫలితం లేదా? అనేక సమస్యలు ఉన్నాయా? వాస్తు ప్రకారం ఇలా చేస్తే అంతా సెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.