ETV Bharat / spiritual

కెరీర్​ ఎదుగూబొదుగూ లేకుండా సాగుతోందా? - వాస్తు సరి చూసుకున్నారా!

Career Growth Vastu Tips : వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణానికీ, ఇంట్లోని వస్తువులకు మాత్రమే కాదు.. ఉద్యోగ జీవితానికీ వర్తిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కెరీర్ ఎదుగుబొదుగూ లేకుండా సాగుతూ ఉంటే.. వాస్తు దోషాలు ఉన్నాయేమో చూసుకోవాలని చెబుతున్నారు.

Vastu Tips
Career Growth Vastu Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 4:14 PM IST

Vastu Tips for Career Growth : ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. కెరీర్​లో పురోగతి సాధించడం కోసం చాలా మంది ఎన్నో అవస్థలు పడుతుంటారు. అయితే.. కొందరు ఎంత కష్టపడి పని చేసినా అనుకున్న స్థానాన్ని పొందలేకపోతారు. దాంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కొన్ని వాస్తు టిప్స్(Vastu) పాటించడం ద్వారా.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలక్రానిక్ వస్తువుల దిశ : ఇల్లు, ఆఫీసుల్లో ల్యాప్​టాప్​, స్మార్ట్​ఫోన్​ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను యూజ్ చేస్తుంటారు. వాటిని వాస్తుప్రకారం సరైన దిశలో ఉంచకపోవడం కెరీర్ వృద్ధిపై ప్రభావం చూపుతుందంటున్నారు. వాస్తుప్రకారం చూస్తే.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్​లను ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిదట. అదేవిధంగా ఆ పరికరాల వైర్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండకుండా, టేబుల్​ టాప్​లో కనిపించకుండా చూసుకోవాలంటున్నారు.

కూర్చునే విధానం : వాస్తుప్రకారం మనం కూర్చుని పనిచేసే విధానం కూడా కెరీర్​ పురోగతిపై ప్రభావం చూపుతుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మీకు ఆఫీసులో కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలంటున్నారు. ఎందుకంటే ఈ అలవాటు కెరీర్ ఎదుగుదల విషయంలో అడ్డంకిగా మారుతుందట. అలాగే కార్యాలయంలో ఎత్తైన కుర్చీలో కూర్చోవడం ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

కూర్చునే దిశ : ఆఫీసులో కూర్చునే విధానం మాత్రమే కాదు.. కూర్చునే దిశ కూడా సరైనదిగా ఉండాలంటున్నారు. వాస్తుప్రకారం ఎప్పుడూ ఉత్తర దిశలో కూర్చుని పని చేయడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా పని చేసేటప్పుడు మీ వెనుక భాగంలో దృఢమైన గోడ ఉండేలా చూసుకోవాలంటున్నారు. దీనితో పాటు మీరు పని చోట వెనుక భాగంలో విండో ఉండకూడదట. వెనుక కిటికీ ఉంటే మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుందట.

వాస్తు - ఈ ఫొటో మీ ఇంట్లో ఉంటే విజయాలను ఎవ్వరూ అడ్డుకోలేరు!

వస్తువులు : వాస్తుప్రకారం.. పనిచేసే ప్రదేశంలో కొన్ని వస్తువులు, స్ఫటికాలు ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. శక్తివంతమైన స్ఫటికాలు మీ శక్తి, సామర్థ్యాలను మెరుగుపరుస్తాయట. క్వార్ట్జ్ స్ఫటికాలను ఉంచడం మంచి అవకాశాలను తెస్తుందని చెబుతున్నారు. అలాగే మీ డెస్క్‌పై వెదురు మొక్కను ఉంచడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు.

డెస్క్​ ఫ్రేమ్ : వాస్తుప్రకారం.. ఎప్పుడూ దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకారంలో ఉండే డెస్క్​లను మాత్రమే ఉపయోగించడం మంచిదట. వృత్తాకార డెస్క్‌లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. దీంతోపాటు ఇంట్లో మీరు పనిచేసే చోటు బెడ్​రూమ్ పక్కన ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

నిద్ర : మనం నిద్రించే దిశ కూడా వాస్తుప్రకారం కెరీర్ వృద్ధికి తోడ్పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం, పడుకునేటప్పుడు తూర్పు వైపు తల ఉంచడం వల్ల కెరీర్ వృద్ధి చెందుతుందట. అలాగే ఇది ఏకాగ్రత స్థాయిలను మెరుగుపరచడమే కాకుండా.. మానసిక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.