ETV Bharat / spiritual

ఉగాది పండగ రోజున - మీ ఆత్మీయులకు సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పండి! - HAPPY UGADI WISHES 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 4:29 PM IST

Updated : Apr 9, 2024, 9:11 AM IST

Happy Ugadi Wishes 2024 : నేడు ఉగాది. తెలుగు లోగిళ్లలో మరో కొత్త సంవత్సరాది ఆరంభమయ్యింది. అదే శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ శుభవేళ మీ ఆత్మీయులు, బంధు మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Ugadi Wishes in Telugu 2024
Ugadi Wishes in Telugu 2024

Ugadi Wishes in Telugu 2024 : నూతన తెలుగు సంవత్సరాది ఉగాది ఆరంభమయ్యింది. ఈ పర్వదినాన్ని ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఘుమఘమలాడే పండివంటలు.. అత్యద్భుతమైన ఉగాది పచ్చడిని ఆరగించి పంచాంగ శ్రవణం చేస్తారు. అయితే.. ఈ పర్వదినాన తమకు దూరంగా ఉన్న బంధు మిత్రులను.. ఆన్​లైన్​ ద్వారా పలకరిస్తుంటారు జనం. తమ వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని, రాబోయే కొత్త ఏడాది ఆసాంతం మంచి జరగాలని కోరుకుంటూ స్పెషల్ విషెస్‌ షేర్ చేస్తుంటారు. అందుకే మీకోసం 'ఈటీవీ భారత్' ఉగాది సందర్భంగా స్పెషల్ వాట్సాప్ విషెస్‌ను తీసుకొచ్చింది. మీ స్నేహితులు, బంధువులు, ఆప్తులకు వాటిని షేర్​ చేసి.. ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.

  • శ్రీక్రోధినామ సంవత్సరంలో మనలోని కోపం, ద్వేషాన్ని జయించి.. ప్రేమ, సహనంతో ముందుకు సాగాలని కోరుకుంటూ.. హ్యపీ ఉగాది
  • శ్రీక్రోధినామ సంవత్సరం.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎన్నో మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
  • ఈ తెలుగు సంవత్సరాది మీ ఆశలు, ఆశయాల నేరవేర్చి.. ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు
  • బంధువులే మన బలం.. బలగం! వారి సమక్షంలో సంతోషంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని కోరుకుంటూ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు
  • వేప చెట్టుకు కొత్త చిగురు వచ్చినట్లు.. మీ జీవితంలో కష్టాలు, నష్టాలు తొలగిపోయి, ఈ శ్రీక్రోధినామ సంవత్సరంలో సంతోషం నిండిపోవాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది
  • ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆనందమే జీవిత పరమార్థం.. ఈ కొత్త ఏడాదిలో మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు
  • జీవితంలోని కష్టాల చీకట్లు తొలగిపోయి.. ఈ కొత్త సంవత్సరంలో సంతోషపు వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది

ఈ ఉగాదికి స్పెషల్ బొబ్బట్లు - పైనాపిల్‌తో అదరగొట్టేయండి! - How To Make Pineapple Bobbatlu

"కాలం మరో కొత్త ఏడాదికి జన్మనిస్తోంది..

మీ కోసం సంతోషాలు ఎదురు చూస్తున్నాయి"

-శ్రీక్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు

"ఉగాది పచ్చడిలో తీపి, చేదు ఉంటుంది..

జీవితంలో కష్టం, సుఖం ఉంటాయి..

ఈ మేలు కలయిలకలో మీ భవిష్యత్తు అద్భుతంగా సాగిపోవాలి."

-హ్యాపీ ఉగాది

"కొత్త కలలతో.. సరికొత్త ఆశలతో..

కొత్త భావాలతో.. సరికొత్త ఆలోచనలతో..

మీరు విజయంవైపు సాగిపోవాలని కోరుకుంటూ.."

- ఉగాది శుభాకాంక్షలు

"ఈ కొత్త సంవత్సరం మీకు ఉప్పొంగే ఉత్సాహాలను.. చిగురించే సంతోషాలను..

విరబూసే వసంతాలను.. అందించాలని కోరుకుంటూ.."

-ఉగాది శుభాకాంక్షలు

"గడిచిపోయిన కాలాన్ని.. ఇక్కడితో మర్చిపోండి..

మీ కోసం నవ వసంతం పురుడు పోసుకుంటోంది..

అద్వితీయమైన క్షణాలను ఆస్వాదించండి"

-హ్యాపీ ఉగాది 2024

ఊరూరా ఉగాది.. అందరికి కలిసి రావాలి ఈ ఏడాది

ఈ ష‌డ్రుచుల‌ను మ‌న జీవితాలకు అన్వ‌యించుకుంటేనే ప్రయోజనం

Last Updated : Apr 9, 2024, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.