ETV Bharat / spiritual

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కులో పెడితే లక్ష్మీ కటాక్షం! అదృష్టం మీ వెంటే! - Tulasi plant Vastu direction - TULASI PLANT VASTU DIRECTION

Tulasi plant Vastu direction : ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క ఇంట్లో ఏ వైపు ఉండాలి? వాస్తు ప్రకారం తులసి మొక్క లేకపోతే కీడు జరుగుతుందా? తులసి పూజను ఎవరు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Tulasi plant Vastu direction
Tulasi plant Vastu direction
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 6:25 AM IST

Tulasi plant Vastu direction : హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా తులసి మొక్క ఏ వైపు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో తులసి ఉంటే విశిష్ట ప్రభావం
ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. తులసి మొక్కని పెరటి గుమ్మం ఎదురుగా అంటే ఒకప్పుడు ఇంట్లో గదులన్నీ నేరుగా ఉండే రోజుల్లో వాకిట్లో నుంచి చుస్తే పెరట్లోని తులసి మొక్క కనబడేది. అలా ఇల్లు ఉన్నవాళ్లు చక్కగా ఆ రకంగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ సంస్కృతి ఉంది. మరి అపార్టుమెంట్లలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇంటికి బాల్కనీ ఎటువైపు ఉంటే ఆ ప్రదేశంలో వాయువ్యం వైపుగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. లేకుంటే ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.

తులసి పూజ ఎవరు చేయాలి
ఇంటి ఇల్లాలు ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంటి యజమాని సూర్యోపాసన తర్వాత తులసి మొక్కకు నీరు పోయాలని వాస్తు శాస్త్రంలో చెప్పారు. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు. ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు, ఉన్నత పదవులు దక్కుతాయి. మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలి. అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించవచ్చు.

తులసి మొక్కను ఎలా కాపాడాలి
తులసి మొక్కకు ఉండే వెన్నును (తులసి మొక్క పైన ఉండే విత్తనాలు)క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది. కొంతమంది తులసి మొక్క వెన్ను ఎక్కువగా పెరిగితే ఇంటి ఇల్లాలు తలనొప్పితో బాధపడుతుందని అంటారు. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారమేది లేదు.

తులసిలో రకాలు
తులసిలో లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అనే రకాలున్నాయి. మన ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఆయా తులసి మొక్కలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా తులసి కోటలో విష్ణు స్వరూపంగా రాతి ప్రతిమను ఉంచే సంప్రదాయం కూడా కొన్ని కుటుంబాలలో ఉంటుంది.

ఆధ్యాత్మికతే కాదు ఔషధం కూడా
ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన వెన్నును చల్లినట్లయితే చక్కగా ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎంత సంపాదించినా అప్పులు తీర్చలేకపోతున్నారా? ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే! - Loan Repayment Vastu Tips In Telugu

లక్ష్మీ కటాక్షం పొందాలా? శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి! - What Not To Do On Friday Hindu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.