ETV Bharat / spiritual

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారి వాహన సేవల పూర్తి వివరాలు ఇవే - Tirumala Brahmotsavam 2024 schedule - TIRUMALA BRAHMOTSAVAM 2024 SCHEDULE

Tirumala Brahmotsavam 2024: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి ప్రతిరోజు స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ సేవల కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శ్రీవారి వాహన సేవల టైమింగ్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

Tirumala Brahmotsavam 2024
Tirumala Brahmotsavam 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 4:54 PM IST

Updated : Oct 3, 2024, 7:40 PM IST

Tirumala Brahmotsavam 2024 Schedule: తిరుమలలో అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి శ్రీవారి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రసాద వితరణకు ఏడు లక్షల లడ్డూలు అదనంగా స్టాక్‌ పెట్టామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక, బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామన్నారు.

అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారికి చంద్రబాబు దంపతులు శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి దర్శనాంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు శ్యామలరావు వెల్లడించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. అక్టోబరు 4 (శుక్రవారం) నుంచి 12 వరకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందురోజు నిర్వహించే అంకురార్పణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. అయితే బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన సేవల టైమింగ్స్ ఏంటో ఈ కథనంలో చదివి తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు:
బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి శ్రీవారి వాహన సేవలు నిర్వహించనున్నారు. గురువారం రాత్రి అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

  • అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు.
  • అక్టోబర్ 5వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనంలో స్వామి వారు ఊరేగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు విహరిస్తారు.
  • అక్టోబర్ 6వ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై కలియుగ నాధుడు విహరిస్తాడు.
  • అక్టోబర్ 7వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు.
  • అక్టోబర్ 8వ తేదీ మంగళవారం బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామి భక్తులను అలరిస్తాడు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సేవను చూడడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు.
  • అక్టోబర్ 9వ తేదీ బుధవారం బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై వేంకటేశ్వరస్వామి ఊరేగుతాడు.
  • అక్టోబర్ 10వ తేదీ గురువారం బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు.
  • అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు.
  • అక్టోబర్ 12వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.
  • బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు జరుగవు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది ఉండదు. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మోత్సవాలలో స్వామివారి దర్శనానికి వెళ్లాలనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్ - వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ - TTD Darshan Through WhatsApp

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం - ఒక్కరోజులోనే శ్రీనివాసుడి దర్శనభాగ్యం - Tirumala Brahmotsavam 2024

Last Updated : Oct 3, 2024, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.