Thirukkarugavur Lord Shiva Temple : పరమశివునికి భోళా శంకరుడని పేరు ఉంది. తన భక్తులను కటాక్షించడానికి ఆ శివుడు అనేక చోట్ల స్వయంభువుగా వెలిసాడు. తమిళనాడులో తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకాలోని 'తిరుక్కరుగావూర్' పుణ్యక్షేత్రం పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం
తిరుక్కరుగావూర్ పుణ్యక్షేత్రంలో పరమశివుడు ముల్లైవనాథర్గా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో విశేషమేమిటంటే ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో ఏర్పడిందంట! అందుకే ఈ శివలింగానికి జలాభిషేకాలు ఉండవు. ఇక్కడ శివలింగానికి పుష్పాలతోనే అభిషేకం జరుగుతుంది.
స్వామిని కొలిచిన మహా శివ భక్తులు
తమిళనాట గొప్ప కవిగా ఖ్యాతికెక్కిన జ్ఞాన సంబంధర్, సుందరార్ మొదలగు ఎందరో గొప్ప శైవ భక్తులు ఇక్కడ స్వామిని కొలిచినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.
చర్మ సంబంధ వ్యాధులు మాయం
ఈ ఆలయంలో స్వామిని నియమ నిష్టలతో 11 సోమవారాలు మల్లెపూలతో కానీ, జాజిపూలతో కానీ అభిషేకిస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.
గర్భవతులను రక్షించే గర్భరక్షాంబికా
తిరుక్కరుగావూర్ ఆలయంలో పార్వతీదేవి గర్భరక్షాంబికా దేవిగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారు 7 అడుగుల సుందరమైన విగ్రహం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
గర్భాన్ని రక్షించే చల్లని తల్లి
ఈ ఆలయంలో గర్భరక్షాంబికా దేవిని గర్భవతులు దర్శించి పూజిస్తే గతంలో నిలవకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్న వారు కూడా అమ్మవారి దయతో పండంటి బిడ్డను ఎత్తుకొంటారు. ఇక్కడి భక్తుల విశ్వాసం ప్రకారం అమ్మవారు గర్భవతులు గర్భాన్ని రక్షించే చల్లని తల్లి అంటారు. అందుకే ఈ ఆలయాన్ని గర్భవతులు ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు.
సంతాన ప్రాప్తిని కలిగించే అమ్మవారు
శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు కేవలం గర్భం దాల్చిన వారిని అనుగ్రహించడమే కాకుండా, సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుందని స్థానికులు అంటారు. దాదాపు వేయి సంవత్సరాలనాటి ఈ ప్రాచీన ఆలయం తంజావూర్– కుంభకోణం వెళ్లే దారిలో కుంభకోణానికి ముందు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇంట్లో పొరపాటున కూడా ఈ మొక్కలు పెంచినా ఇబ్బందులే- బీ కేర్ ఫుల్! - Plants Not Good For Home