ETV Bharat / spiritual

"అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టాలంటే - సోమవారం ఈ పనులు అస్సలు చేయకూడదట" - Monday Lucky Things

Monday Lucky Things : మీకు జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. కొన్ని పనులు ఆ రోజున తప్పకుండా చేయాలని చెబుతున్నారరు. దీనివల్ల శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Monday Dos and Donts As Per Astrology
Monday Lucky Things (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 21, 2024, 9:42 AM IST

Monday Dos and Donts As Per Astrology : కొంతమంది వారంలో ఈ రోజు.. ఈ పనులు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అందులో ముఖ్యంగా చాలా మంది సోమవారాన్ని సెంటిమెంట్​గా ఫీలవుతుంటారు. అలాంటివారికోసమే ఈ స్టోరీ. ఎందుకంటే.. మిమ్మల్ని అదృష్టం వరించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. సోమవారం ప్రత్యేకంగా కొన్ని పనులు స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు.

ఈ పనులు చేయకూడదట!

  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సోమవారం అదృష్టం కలిసిరావాలంటే ఎవరూ నలుపు, బ్లూ కలర్ దుస్తువులు ధరించకూడదు. ఆ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుందట. అదేవిధంగా.. పుస్తకాలు, పెన్నులు వంటివి కొనుగోలు చేయకూడదు.
  • అలాగే.. పత్తి కొనకూడదు. అంతేకాదు.. దీపారాధన కోసం పత్తితో చేసుకునే వత్తులు ఈ రోజు చేసుకోకూడదట. అందుకు బదులుగా బుధవారం చేసుకోవడం మంచిదంటున్నారు.
  • బెండకాయలు, ఆవాలు, పనసకాయ, నల్ల నువ్వులు, మసాలు దినుసులు వంటివి ఆ రోజు తీసుకునే ఆహారంలో ఉండకూడదట. ఈ తప్పులు వీలైనంత వరకు చేయకుండా చూసుకోవాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.

సోమవారం చేయాల్సిన పనులు :

  • ఆ రోజున మొక్కలు నాటడం చాలా మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్. ఈ రోజు ఏదైనా మొక్క నాటి నీరు పోశారంటే త్వరలో మీకు అదృష్టం కలిసివస్తుందంటున్నారు.
  • మీరు ఏదైనా వెండి వస్తువు కొనాలనుకుంటే సోమవారం కొనడం శ్రేయస్కరమని చెబుతున్నారు.
  • అలాగే ఎవరైనా సింగింగ్, డ్యాన్సింగ్, సంగీత పరికరాలు ఏవి నేర్చుకోవాలనుకున్నా.. అవి సోమవారం స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు. వాళ్ల రంగంలో చాలా బాగా సక్సెస్ అవుతారట.
  • కొత్తపనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు, తెలిసిన వారు ఉంటే వారి సలహాలు ఆ రోజున తీసుకోవాలనుకుంటే మంచిది.
  • వ్యవసాయదారులు జామ, అరటి, కొబ్బరి వంటి పంటల సాగు ఈ రోజున మొదలెడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
  • అక్షరాభ్యాసం, పుట్టువెంట్రుకలు, నామకరణ, అన్నప్రాశన వంటి అన్నిటికీ మంచి రోజుగా సూచిస్తున్నారు.
  • బోర్ వేయించడానికి మంచి రోజు ఇదేనట. కానీ.. శంకుస్థాపన వంటివి చేయకూడదట.
  • సోమవారం పెళ్లిచేసుకోకూడదట. ఈరోజు వివాహాం చేసుకుంటే దాంపత్య బంధం నిలబడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే.. పెళ్లి పనుల కోసం పసుపు దంచడం వంటివి ఈరోజు స్టార్ట్ చేయకూడదట.
  • సోమవారం రోజున ఉదయం 6 నుంచి 7.. మధ్యాహ్నం 1 నుంచి 2 .. రాత్రి 8 నుంచి 9 మధ్యలో "చంద్రహోర సమయం" ఉంటుందట. ఆ టైమ్​లో ఎవరైనా సరే వెండి కొనుకున్నా, వెండి పాత్రలో ఆహారం స్వీకరించినా లక్ష్మీకటాక్షం కలుగుతుందంటున్నారు.
  • స్త్రీలతో ఎలాంటి ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా ఆ రోజు మంచిదట.
  • నీటి మీద జర్నీ చేయాలన్నా.. అదే రోజున చేయాల.
  • పాలు, పెరుగు, కాటన్ బిజినెస్, మార్బుల్ స్టోన్ వంటి తెలుపు వస్తువులకు సంబంధించిన ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా సోమవారం చంద్రహోర సమయంలో స్టార్ట్ చేయాలట.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

'రావి ఆకుపై ఇలా రాసి పెడితే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి'

గురుదోషంతో ఉద్యోగంలో సమస్యలా? ఈ పూజ చేస్తే సక్సెస్ మీ వెంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.