Vastu Tips for Gods Offer Flowers : దేవుళ్లకు పూజా చేసే సమయంలో పూలు ప్రముఖ పాత్రపోషిస్తాయి. అయితే.. వాస్తుప్రకారం దేవుళ్లకు సమర్పించకూడని పూలు కూడా కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అవి సమర్పిస్తే మీరు ఆ భగవంతుడి ఆశీస్సులు పొందడమేమో కానీ.. ఆయన ఆగ్రహానికి గురవుతారంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇంతకీ.. ఏ పూలు సమర్పించకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాముడు : మీ ఆరాధ్య దైవం రాముడు అయితే ఆయనకు వాస్తుప్రకారం సమర్పించకూడని పూలు ఉన్నాయి. అవేంటంటే.. గన్నేరు పువ్వులను ఎప్పుడూ శ్రీ రామునికి సమర్పించకూడదట. ఇది అశుభకరమైనదిగా పేర్కొంటున్నారు వాస్తు పండితులు. అలా చేయడం వలన మీరు కోరుకున్న కోర్కెలు నెరవేరకపోవచ్చు, అనుకున్న ఫలితాలు పొందకపోవచ్చంటున్నారు వాస్తు పండితులు.
శివుడు : ఆ పరమ శివుడి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కేతకి లేదా కేవద పుష్పాలను సమర్పించకూడదంటున్నారు. ఆ పువ్వులను ఈశ్వరునికి సమర్పించడం వల్ల ఆయనకు కోపం తెప్పించిన వాళ్లు అవుతారట! అలాగే మీ పూజలు ఫలించకపోవచ్చని చెబుతున్నారు.
సూర్య భగవానుడు : చాలా మంది ఉదయం లేవగానే సూర్య భగవానుడిని పూజిస్తుంటారు. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం.. సూర్య దేవుడిని ఆరాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బెల పత్రాన్ని సమర్పించకూడదట. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి కోపం రావచ్చంటున్నారు పండితులు. మీరు ఆయన ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!
విష్ణువు : త్రిమూర్తులలో ఒకరైన విష్ణువును పూజించే సమయంలో కొన్ని పూలకు దూరంగా ఉండడం మంచిదట. మహా విష్ణువును ఆరాధించే సమయంలో ఎప్పుడూ అగస్త్య పుష్పాలను సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయట. అంతేకాకుండా.. ఆ శ్రీ మన్నారాయణుడిని పూజించే సమయంలో మాధవి, లోధ్ పుష్పాలను కూడా సమర్పించకూడదట.
దుర్గాదేవి : వాస్తుశాస్త్రం ప్రకారం దుర్గామాతకు సమర్పించకూడని పూలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చెల్లాచెదురుగా ఉన్న రేకులతో కూడిన పువ్వులు, ఘాటైన వాసన కలిగిన పువ్వులు, నేలపై పడిన పుష్పాలను పూజ సమయంలో దుర్గాదేవికి ఎట్టిపరిస్థితుల్లో సమర్పించకూడదట. ఈ పువ్వులను దుర్గాదేవి అప్రియమైనవిగా భావిస్తుందట. తద్వారా ఆమె ఆశీస్సులు పొందడం సాధ్యం కాదట.
పార్వతీదేవి : జిల్లేడు, ఉమ్మెత్త పూలు పరమశివునికి ఇష్టమైనవి. కానీ, పార్వతి దేవికి వాస్తుప్రకారం జిల్లేడు పూలను సమర్పించడం మంచిది కాదంటున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల అమ్మవారికి ఆగ్రహం తెప్పించినవారువుతారట. కాబట్టి.. పార్వతీ దేవిని పూజించేటప్పుడు ఈ పూలను సమర్పించకపోవడం మంచిది అంటున్నారు పండితులు.
NOTe : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీ ఇంట్లో ఏడు గుర్రాల ఫొటో లేదా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - Vastu Tips For Home