Simhachalam Appanna Chandanotsavam : సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మి నరసింహ స్వామి స్వయంభువు. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులు స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోవచ్చు. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున జరిగే పరమ పవిత్రమైన ఉత్సవం చందనోత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. అనంతరం స్వామికి తొలి విడత సమర్పణ ఉంటుంది. ఈ రోజు స్వామిని నిజరూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది, మోక్షాన్ని పొందుతారని శాస్త్ర వచనం.
- సింహాద్రి అప్పన్నకు వైశాఖ శుద్ధ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ ఉంటుంది.
- నరసింహ స్వామికి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి మూడో విడత చందన సమర్పణ ఉంటుంది.
- సింహాద్రి అప్పన్నకు ఆషాడ పౌర్ణమికి నాలుగో విడత చందనం సమర్పణ ఉంటుంది.
కరాళ చందనం
నాలుగు విడతల చందన సమర్పణ పూర్తయిన తర్వాత శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం అనే కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని కరాళ చందన సమర్పణ ఉత్సవాన్ని అంటారు.
జన్మరాహిత్యాన్ని కలిగించే పవిత్రోత్సవం
భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు స్వామి వారి నిత్యనైమిత్తికాలలో తెలిసి గానీ, తెలియక గానీ జరిగిన దోష నివారణ కోసం జరిపే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ ఉత్సవం కనులార చూసినా వారికి పునర్జన్మ ఉండదని పెద్దలు అంటారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
వైకుంఠ ద్వార దర్శనం
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు పగల్పత్తు 10 రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. ఈ రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు. వరాహ నరసింహుని ఆలయంలో ధనుర్మాసంలో నెల రోజుల పాటు తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసం చివర భోగినాడు సింహాచలం లో శ్రీ గోదారంగనాయకుల కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపమైన శ్రీలక్ష్మి నరసింహస్వామివారి నిజ రూప దర్శనం సకల పాపహరణం, ఐశ్వర్య కరకం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనాలా? లేకుంటే ఏమవుతుంది? - AKSHAYA TRITIYA 2024