ETV Bharat / spiritual

సకల బాధలను తొలగించే 'శని ప్రదోష' పూజ! ఎలా చేసుకోవాలో తెలుసా? - Shani Pradosh Puja

Shani Pradosh Puja : అరుదుగా వచ్చే శని ప్రదోష పూజ, భక్తి శ్రద్ధలతో చేస్తే అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. జీవితంలో ఒక్కసారి శని ప్రదోష పూజ చేస్తే దీర్ఘకాలిక రోగాలు, మానసిక సమస్యలు పోతాయి. అసలు శని ప్రదోష పూజ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Shani Pradosh Puja
Shani Pradosh Puja (Gettyimages)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 3:32 PM IST

Shani Pradosh Puja : శివ మహా పురాణంలో వివరించిన ప్రకారం, దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శని ప్రదోషంగా పిలుస్తారు.

శని ప్రదోషం ఎప్పుడు వస్తుంది?
ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండవది కృష్ణ పక్షంలో. ఈ త్రయోదశి తిథి శనివారం మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషంగా పరిగణిస్తారు. ఆగస్టు 31 వ తేదీ శనివారం మధ్యాహ్నం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి.

శని ప్రదోష పూజకు శుభసమయం
శని ప్రదోషం పూజను సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు.

శని ప్రదోష పూజ ఎవరు చేస్తే మంచిది
జాతకంలో శని దశలు అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఈ పూజను తప్పకుండా చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నవారు కూడా ఈ పూజ చేసుకుంటే ఆర్థిక బాధల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను పోగొట్టుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ప్రదోష వేళ శివారాధన - సకల దోష పరిహారం
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అంతేకాదు ఈ ప్రదోష కాల పూజను భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం.

శని ప్రదోష పూజా విధానం
శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో గంగాజలంతో, ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

అభిషేకం చేయించలేని వారు ఏమి చేయాలి?
శని ప్రదోషం సమయంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. సమస్త దోషాలను పోగొట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు.

శని ప్రదోష పూజాఫలం
శని ప్రదోష పూజ చేసిన వారికి జన్మాంతర కర్మల వలన అనుభవిస్తున్న బాధలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయి. త్వరలో రానున్న శని ప్రదోష పూజను ఆచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం.

ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శని తిరోగమనం- ఆ 3రాశుల వారికి బ్రహ్మాండ యోగం- మీది ఉందేమో చెక్! - Shani Retrograde From The 29th June

జాతకంలో దోషాలా? శనివారం ఆ చెట్టుకు పూజ చేస్తే అంతా సెట్! - Puja For Shani Shanti

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.