ETV Bharat / spiritual

నర్మదా పుష్కర స్నానం చేసే విధి విధానాలేంటి? 12వ రోజు ఏ దానం చేయాలి? - Narmada Pushkaralu 2024 - NARMADA PUSHKARALU 2024

Narmada Nadi Pushkaralu 2024 : హిందూ సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానం పరమ పవిత్రమైనది. మరికొద్ది గంటల్లో పవిత్ర నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా పుష్కర స్నానం చేసే విధి విధానాలు ఏమిటి? ఎలాంటి దానాలు చేయాలి? పితృదేవతల ప్రీతి కోసం ఆచరించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

Narmada Nadi Pushkaralu 2024
Narmada Nadi Pushkaralu 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 4:39 PM IST

Narmada Nadi Pushkaralu 2024 : 'నీరు' నారాయణ స్వరూపం కాబట్టి శరీరానికి నీటి స్పర్శ అంటే స్నానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు శుచి అవుతారని శాస్త్రం చెబుతోంది. తీర్థ స్నానం ఉత్తమం. నదీ స్నానం అంతకంటే ఉత్తమం. వీటన్నిటికంటే పరమ పవిత్రమైనది పుష్కర స్నానం. ఎందుకంటే పుష్కర సమయంలో నదీ జలాల్లో దేవతలు, మహర్షులు పుష్కరునితో సహా ప్రవేశిస్తారట! అందుకే హిందూ వైదిక ధర్మం పుష్కర స్నానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది.

పుష్కర స్నానం విధివిధానాలు
పుష్కర స్నానం చేయడానికి నదిలోకి ప్రవేశించే ముందు నది ఒడ్డున ఉన్న మట్టిని కొంచెం చేతితో తీసుకొని నదిలో కలిపి అనంతరం స్నానం చేయాలని పండితులు చెబుతారు. అలాగే స్నానం చేసేటప్పుడు నదికి నమస్కరించి ముక్కు మూసుకొని మూడు మునకలు పూర్తిగా శిరస్సు మునిగేలా వేయాలి. ఈ స్నానం చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ సబ్బులు, షాంపూలు వంటివి వాడరాదు. అలా చేస్తే నదీ జలాలు కలుషితం అవుతాయి.

సూర్య తర్పణం
నదిలో మూడు మునకలు వేసిన తర్వాత మూడు సార్లు దోసిట్లోకి పవిత్ర నదీ జలాలను తీసుకొని సూర్య తర్పణం ఇవ్వాలి. దీనినే అర్ఘ్యం అని కూడా అంటారు.

పితృ తర్పణం
పుష్కర స్నానం పూర్తయిన తర్వాత ఒడ్డుకు వచ్చి తడి వస్త్రాలను పిండుకొని బ్రాహ్మణ ముఖంగా శక్తి కొలది పితృ తర్పణం ఇస్తే పితృదేవతల అనుగ్రహం వలన వంశం నిలబడుతుంది.

పుష్కర సమయంలో ఎలాంటి దానాలు ఇవ్వాలి?
పుష్కర సమయంలో చేసే దానాలకు విశిష్టమైన ప్రాముఖ్యం ఉందని శాస్త్రం చెబుతోంది. అయితే ఏ రోజు ఎలాంటి దానం ఇస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మొదటి రోజు : బంగారం, వెండి, ధాన్యాలు, భూమి
  • రెండో రోజు : వస్త్రదానం, ఉప్పు, రత్నాలు
  • మూడో రోజు : బెల్లం, పండ్లు
  • నాలుగో రోజు : నెయ్యి, నూనె, పాలు, తేనె
  • ఐదో రోజు : ధాన్యాలు, ఎద్దులు, నాగలి
  • ఆరో రోజు : ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి
  • ఏడో రోజు : గృహదానం, శయ్య దానం, పీట దానం
  • ఎనిమిదో రోజు : చందనం, కందమూలాలు, పూలమాలలు
  • తొమ్మిదో రోజు : పిండదానం, కన్యాదానం, దాసి దానం, కంబళి దానం
  • పదో రోజు : కూరగాయలు, సాలగ్రామ దానం, పుస్తక దానం
  • పదకొండో రోజు : గజం అంటే ఏనుగు దానం
  • పన్నెండో రోజు : తిల అంటే నువ్వులు దానం

అయితే పైన చెప్పినవి యధాతథంగా చేయలేని వారు ధన రూపంలో బ్రాహ్మణులకు దానం చేయవచ్చు.

నదీమతల్లికి సుమంగళి పూజ
పుష్కర సమయంలో ఆడపడచులు సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ నదీమతల్లికి చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలు వంటి సుమంగళి ద్రవ్యాలను సమర్పిస్తారు. ఇలా చేస్తే అన్ని పనుల్లో విఘ్నాలు దూరమై సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.

నదికి హారతులు
పుష్కర సమయంలో నదులకు హారతులు ఇవ్వడం కూడా మన సంప్రదాయంలో భాగమే! ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి దృష్టి దోషాలు తగలకుండా, శాంతి పరిహారంగా హారతులు ఇస్తారు. తీర్ధ స్నానం, నదీ స్నానం, పుష్కర స్నానం, సముద్ర స్నానం మన సంప్రదాయంలో భాగం. మన సంప్రదాయాలను మనం పాటించి మన పిల్లకు వాటి విలువలను తెలియజేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలు మన భావితరాలకు భద్రంగా అందించాలి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పెద్ద పండుగకు 'నర్మదా' నది సిద్ధం- పుష్కరాలు ఏడాది అంతా ఉంటాయా? - Narmada Pushkaralu 2024

మే 1 నుంచి నర్మదా నది పుష్కరాలు- ఎక్కడ జరగనున్నాయో తెలుసా ? - Narmada Pushkaralu 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.