ETV Bharat / spiritual

ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలో తెలుసా? - వాస్తు ఏం చెబుతోంది? - Lord Ganesh Vastu Tips - LORD GANESH VASTU TIPS

Lord Ganesh Vastu Tips : ముక్కోటి దేవుళ్లలో మొదటి పూజ అందుకునే దైవం గణపతి. అందుకే.. దాదాపుగా ప్రతీ హిందువు పూజ గదిలో విఘ్నేశ్వరుడి ప్రతిమ ఉంటుంది. అయితే.. ఇంట్లో ప్రతిష్ఠించే గణపతి ప్రతిమ తొండం ఎటువైపు ఉండాలో మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా??

Lord Ganesh Vastu Tips
Lord Ganesh Vastu Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 12:07 PM IST

Lord Ganesh Vastu Tips : విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే.. హిందువులంతా ఏ పని ప్రారంభించినా.. ఎటువంటి ఆటంకాలూ కలగకుండా ఉండాలని గణపతి దేవుడికే తొలి పూజ చేస్తుంటారు. ఏకదంతుడికి నిత్య పూజలు చేసేందుకోసం భక్తులు తమ ఇంట్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకుంటారు. అయితే.. ఇంట్లో ప్రతిష్ఠించే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలనే విషయం.. చాలా మంది తెలియదు. తొండం ఎడమ వైపున ఉన్నది తీసుకోవాలా? లేదా కుడి వైపున ఉన్నది తీసుకోవాలా? అనే సంగతి తెలియదు. మరి.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతిమ తొండం ఎటువైపు ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తొండం కుడివైపు ఉన్న గణపతి విగ్రహం విశేషాలు..
వినాయక విగ్రహానికి తొండం కుడివైపు ఉంటే ఆ విగ్రహాన్ని 'దక్షిణ మూర్తి' అంటారు. హిందూ ధర్మాల ప్రకారం.. ఈ విగ్రహాలకు చాలా శక్తి ఉంటుందట. ఈ విగ్రహాలు అపారమైన సూర్యశక్తి కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. సనాతన ధర్మంలో కుడివైపును యమలోక దిశగా చెబుతారు. ఈ విధంగా తొండం ఉన్న విగ్రహాలను పూజించేట్పపుడు నియమనిష్టలు కచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. తొండం కుడివైపున ఉన్న విగ్రహాలను పూజించడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోయి జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. అందుకే ఈ గణేశుడిని 'సిద్ధి వినాయకుడు' అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ విగ్రహాలు ఆలయాల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

తొండం ఎడమై వైపు ఉన్న గణపతి ప్రాముఖ్యత :
వినాయక విగ్రహానికి తొండం ఎడమ వైపు ఉన్న వాటిని 'వామముఖి మూర్తి' అని పిలుస్తారు. ఈ విగ్రహాలలో అపారమైన చంద్రుడి శక్తి నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఉన్న విగ్రహాలను ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని సూచిస్తున్నారు. రోజూ ఈ గణపతి దేవుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి.. పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుందని తెలియజేస్తున్నారు. ఇళ్లలో గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలని ఆలోచిస్తున్న వారు.. ఎడమవైపు తొండం ఉన్నది తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

గణపతి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా? - ఈ రూపంలోనివి ఇవ్వకూడదట!!

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.