ETV Bharat / spiritual

క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు- వారికి ఆదాయం 2, వ్యయం 14! - Ugadi Rasi Phalalu 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 4:01 AM IST

Updated : Apr 9, 2024, 9:32 AM IST

Krodhi Nama Samvatsara Rasi Phalalu : క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు- వారికి ఆదాయం 2, వ్యయం 14!

Krodhi Nama Samvatsara Rasi Phalalu

.

మేషం (Aries) : ఆదాయం 8; వ్యయం 14 రాజపూజ్యం 4; అవమానం 3
మేష రాశి వారికి అదృష్ట యోగం 75% బాగుంది. పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. ధన స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల సుఖం, కీర్తి, ధనలాభం, ధర్మకార్యాచరణ ఉంటాయి. గురుబలం మే వరకు తక్కువగా ఉన్నా ఆ తర్వాత బాగుంటుంది. ధనలాభం శుభప్రదంగా కలుగుతుంది. అభీష్ట సిద్ధి జరుగుతుంది. విద్యాయోగం ఉంటుంది. ఏకాదశంలో శని ద్వారా విశేషమైన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి ఆలోచనా విధానంతో పని చేస్తే తప్పక కలసి వస్తుంది. వృత్తిలో రాణిస్తారు. పంటలు బాగా పండుతాయి. విదేశీ యోగం అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. భూ, గృహ, వాహన యోగాలు కలసి వస్తాయి. పెళ్లి కాని వారికి ఉత్తరార్ధంలో కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతాన యోగం ఉంది. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులు అందరికీ మేలు జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. సంబంధిత రంగాల్లో విశేష కృషి చేస్తే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ధర్మం రక్షిస్తుంది. సంతోషం, సంతృప్తి, మనఃశాంతి పూర్తిగా లభిస్తాయి. మార్చి 29నుంచి మేష రాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. వీరికి శని ధ్యానం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 7; అవమానం 3
వృషభ రాశి వారికి అదృష్ట యోగం 25శాతం మాత్రమే. ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం, ప్రభుసన్మానం, పశులాభం, భోజనసౌఖ్యం, వస్త్ర, వస్తుప్రాప్తి వంటి శుభఫలితాలు ఉంటాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. విద్య విషయంలో గురుబలం కలిసొచ్చేలా లేదు. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. గ్రహదోషం ఎక్కువగా ఉంది. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు. విదేశయోగం అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. భూ, గృహ, వాహన యోగాలు బాగున్నాయి. పెళ్లి కాని వారికి కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి.

.

మిథునం (Gemini) : ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 6
మిథున రాశి వారికి 50 శాతం అదృష్ట యోగం ఉంది. పూర్వార్థంలో గురువు వల్ల కీర్తివృద్ధి, సర్వత్రా విజయం, శత్రువులు మిత్రులవడం వంటివి జరుగుతాయి. రాహువు దశమ రాజ్యకేంద్రంలో సంతోషం, భోజన సౌఖ్యం, కర్మసిద్ధి, శరీరబలం వంటి శుభఫలితాలను ప్రసాదిస్తున్నాడు. మే తర్వాత గురుబలం తగ్గుతుంది. విద్యాయోగం బాగుంది. ఉద్యోగంలో పదవీలాభం ఉంది. వ్యాపారంలో ధనలాభం రావచ్చు. వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థితికి వెళ్తారు. వ్యవసాయం కలసి వస్తుంది. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. మే వరకు ధనలాభం అద్భుతంగా ఉంటుంది. అదే నెల వరకు వివాహఘడియలు సానుకూలం. కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

.

కర్కాటకం (Cancer) : ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 6; అవమానం 6
కర్కాటక రాశి వారికి 50 శాతం అదృష్ట యోగం ఉంది. ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి, శత్రువులపై విజయం కలుగుతాయి. మూడో రాశిలో కేతువు వల్ల సౌభాగ్యం, ధనలాభం, ఆరోగ్యం వంటి శుభాలు ఉన్నాయి. విద్యార్థులకు అద్భుతమైన విద్యాయోగం ఉంది. ఉద్యోగ విషయాల్లో పూర్వార్థం బాగుంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. మే నుంచి మంచి లాభాలు ఉంటాయి. వ్యవసాయంలో విజయాలు కలుగుతాయి. విదేశీ యానానికి అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్తారు. భూ, గృహ, వాహనయోగాలు శుభఫలితాన్ని ఇస్తాయి. మంచి జీవితభాగస్వామి దొరుకుతారు. సంతాన సౌఖ్యం ఉంది. సంతోషం, సంతృప్తి, మనఃశాంతి కర్కాటక రాశి వారికి చక్కగా ఉంటాయి.

క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు
క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు
.

సింహం (Leo) : ఆదాయం 2; వ్యయం 14; రాజపూజ్యం 2; అవమానం 2
సింహ రాశి వారికి అదృష్టయోగం 25 శాతం మాత్రమే. మే వరకు భాగ్య బృహస్పతియోగం వల్ల ధనలాభం, మంచి భోజనం, సుఖం లభిస్తాయి. శని, రాహు, కేతు గ్రహాలు సహకరించడం లేదు. కాబట్టి వారిని ధ్యానించాలి. మే వరకు విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. అదే నెల వరకు వ్యాపార యోగం కూడా బాగుంది. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఉండవు. వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మే తర్వాత విదేశ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త పడాలి. భూ, గృహ వాహనాల విషయంలో బాగా ప్రయత్నించాలి. పెళ్లి కాని వారికి మే వరకు అనుకూల సమయం. కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతాయి. మనోధైర్యంతో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగాలి.

.

కన్య (Virgo) : ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 5; అవమానం 2
గురు, శని గ్రహాల వల్ల 50 శాతం మంచి ఫలితాలున్నాయి. మే నుంచి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం, గృహలాభం, మంచి భోజనం వంటి ఫలితాలు ఉంటాయి. ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల అదృష్టవంతులు అవుతారు. ఉన్నత విద్యల్లో రాణిస్తారు. ఉద్యోగంలో పదవీయోగం ఉండొచ్చు. స్థిరత్వం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ధనలాభాలు బాగా ఉంటాయి. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు. వ్యవసాయంలో ప్రయోగాలు సఫలం అవుతాయి. పంటలు బాగా పండుతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో సఫలమవుతారు. మే వరకు సామాన్యంగా ఉన్నా ఆ తర్వాత అద్భుతమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడులు కలసి వస్తాయి. కార్యసిద్ధి ఉంటుంది. మే తర్వాత వివాహయోగం శుభప్రదం. సంతానం గురించి శుభవార్త వినొచ్చు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సుఖాలే ఎక్కువగా ఉంటాయి. సంతోషం, మనఃశాంతి, సంకల్పసిద్ధిని పొందుతారు.

.

తుల (Libra) :ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 1; అవమానం 5
తులా రాశివారికి అదృష్టయోగం 50%. గురు, రాహువు అనుకూలం. మే వరకు సప్తమంలో మేష గురువు రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి శుభఫలితాలను కలగజేస్తాడు. షష్ఠ స్థానంలో మీన రాహువు ధైర్యాన్ని, శత్రువులపై విజయాన్ని, భూలాభాన్ని ప్రసాదిస్తాడు. పూర్వార్థంలో విద్యాయోగం అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో అధికార లాభం! వ్యాపారంలో అధిక ధనలాభం ఉంది. వృత్తిలో క్రమంగా ఎదుగుతారు. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. భూ గృహ వాహన యోగాలు కలసిరావచ్చు. ఈ సంవత్సరం వివాహయోగం శుభప్రదం. సంతానవృద్ధి కలుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5
వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం 50 శాతం. ఉత్తరార్థంలో వృషభ బృహస్పతి రాజదర్శనం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. ఏకాదశంలో కన్యా కేతువు పశులాభాన్ని, భోజన సౌఖ్యాన్ని, వస్త్ర, వస్తు ప్రాప్తిని కలగజేస్తాడు. విద్యాయోగం బాగుంది. అనుకున్న పని జరుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. వ్యాపారంలో కలసి వస్తుంది. వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యవసాయంలో ఆశించిన లాభాలు వస్తాయి. విదేశ యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రదర్శనం కొత్త శక్తిని ఇస్తుంది. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. భూ, గృహ, వాహన యోగాలు సానుకూలం. ఉత్తరార్థంలో కల్యాణ ఘడియలు బాగున్నాయి. సంతానభాగ్యం ఉంది. కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. గురు, శని, రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 5
ధనుస్సు రాశి వారికి అదృష్టయోగం 75 శాతం. పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం వంటి ఫలితాలను ఇస్తున్నాడు. దశమంలో కేతువు- సర్వసుఖాలనూ కలగజేస్తున్నాడు. బృహస్పతి అనుగ్రహం వల్ల మే వరకు విద్యార్థులకు అద్భుతమైన విద్యాయోగం ఉంది. గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలోనూ మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికారయోగం ఉంటుంది. వ్యాపారంలో మే వరకు మంచి లాభాలున్నాయి. భవిష్యత్తు ఆశాజనకం. వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. నూతనత్వంతో కూడిన ఆలోచనలతో సఫలమవుతారు. వ్యవసాయంలో మంచి పంట చేతికి వస్తుంది. విదేశయోగం బాగుంది. మే నెల వరకు మంచి ఆర్థిక యోగాలున్నాయి. తర్వాత రుణసమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోలి. భూ, గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి మే లోగా మంచి భాగస్వామి దొరుకుతారు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తప్పుతాయి. ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం, మనఃశాంతి లభిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలకై రాహు, గురు శ్లోకాలు చదువుకోవాలి.

.

మకరం (Capricorn) : ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 3; అవమానం1
గురు, కేతు గ్రహాల వల్ల మకర రాశి వారికి అదృష్టయోగం 50 శాతం అనుకూలం. ఉత్తరార్థంలో గురువు ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం, ఆరోగ్యం, కీర్తి వంటి ఫలితాలను ఇస్తాడు. చక్కని విద్యాయోగం ఉండొచ్చు. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. వేర్వేరు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశదిశలా వ్యాప్తి చెందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో మెప్పు పొందుతారు. స్థిరమైన వృత్తి లభిస్తుంది. వ్యవసాయపరంగా కలసి వస్తుంది. ఆశించిన లాభాలు వస్తాయి. విదేశ ప్రయత్నాలు సఫలం అవుతాయి. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంటుంది. ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు. పెళ్లి కాని వారికి మే తర్వాత ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొందరికి ఆదర్శనీయులు అవుతారు. కష్టాలు తొలగిపోతాయి. కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్లాలి. సంతృప్తి, మనఃశాంతి, సంకల్పసిద్ధి అద్భుతంగా ఉన్నాయి. శని, కేతు, గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది.

.

కుంభం (Aquarius) : ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 6; అవమానం 1
ఈ ఏడాది కుంభరాశి వారికి గురు, శని, రాహు, కేతు గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పని చేయాలి. లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. ఉద్యోగంలో సకాలంలో పని చేస్తే ఇబ్బందులు తప్పుతాయి. వ్యవసాయంలో పరిస్థితులు బాగా లేవు. గ్రహదోష నివారణ కోసం ఇష్టదేవతను సందర్శించడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సంతానంతో ఇబ్బందులు రాకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి.

.

మీనం (Pisces) : ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 4
ధనస్థానంలో బృహస్పతి మీనరాశి వారిని పూర్వార్థంలో సదా రక్షిస్తున్నాడు. సుఖం, సౌభాగ్యం, కీర్తి వంటి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. వాక్శుద్ధి వీరిని రక్షిస్తుంది. మే వరకు విద్యాయోగం అనుకూలం. ఉన్నత విద్యల్లో బాగా కష్టపడాలి. ఉద్యోగం సానుకూలం. వ్యాపారయోగం మిశ్రమం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహదోష నివారణ కోసం తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. భూ, గృహ, వాహన యోగాలు మిశ్రమం. పెళ్లి కాని వారికి మే నెల వరకు కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. సంతానయోగం శుభప్రదం.

Last Updated : Apr 9, 2024, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.