ETV Bharat / spiritual

ఉత్తర రామాయణం ప్రామాణికమా? కల్పితమా? - Uttar Ramayan Explainer In Telugu - UTTAR RAMAYAN EXPLAINER IN TELUGU

Is Uttar Ramayan Authentic Or Not : ఉత్తర రామాయణం లేదా రామాయణంలోని ఉత్తర కాండ ప్రామాణికమా? లేక కల్పితమా? వాల్మీకి మహర్షి ఉత్తర రామాయణాన్ని వాస్తవంగా రచించారా? ఈ ప్రశ్నలకు శ్రీనివాస్ జొన్నలగడ్డ విశ్లేషణ మీకోసం.

Is Uttar Ramayan Authentic Or Not
Is Uttar Ramayan Authentic Or Not (ETV Bharat via Wikimedia Commons)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 6:00 AM IST

Updated : Aug 25, 2024, 8:53 AM IST

Is Uttar Ramayan Authentic Or Not : ఎన్నో శతాబ్దాలుగా విద్వాంసులు, పండితులు ఉత్తర రామాయణ అంశంపై విశ్లేషణాత్మక చర్చలు జరుపుతూ వస్తున్నారు. సీతాదేవి భూమాతలో కలిసిపోవడం, కుశ-లవుల కథ వంటి భావోద్వేగ భరితమైన అంశాలు ఉత్తర కాండలో చూడవచ్చు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దొరకడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ముందు ఈ వివాదాస్పద అంశాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం.

మందరము పుస్తకంలో వాసుదాస స్వామి చేసిన వాదనలు!
రామాయణంపై వాసుదాస స్వామి చేసిన ప్రసిద్ధ రచన 'మందరము'. మందరము అంటే కల్పవృక్షం అని అర్థం. ఈ గ్రంథంలో ఉత్తర కాండ రామాయణంలో ఒక భాగమని వాసుదాస స్వామి తెలియజేశారు. తన వాదనను బలపరిచే క్రమంలో ఆయన 10 ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. అందులో అత్యంత బలమైనవిగా భావించే మూడు కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. మహర్షి వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు రాశారు. అందులో ప్రతి 1000 శ్లోకాల సముదాయం గాయత్రీ మంత్రంలోని ఒక్కో అక్షరంతో ప్రారంభమవుతుంది. ఉత్తర కాండను తీసేస్తే, రామాయణ శ్లోకాల సంఖ్య 24,000 కన్నా తగ్గిపోతుంది. ఈ అంశం ఆధారంగా ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగమేనని అనిపిస్తుంది.
  2. బాలకాండ 1.1.91 శ్లోకంలో మహర్షి నారదుడు రామరాజ్యాన్ని వర్ణిస్తూ, "రామరాజ్యంలో పుత్రులు ఎవరూ తమ తండ్రుల కన్నా ముందే మరణించరు" అని పేర్కొన్నారు. ఉత్తర కాండ రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో వివరిస్తూ ఈ అంశాన్ని నిర్ధారించినట్లుగా కనిపిస్తోంది. అందువల్ల రామాయణంలో ఉత్తరకాండ భాగమేనని సమర్ధిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
  3. బాలకాండ 1.3.38 శ్లోకంలో "వైదేహ్యాశ్చ విసర్జనం" అనగా సీతని త్యజించటం అనే వాక్యాన్ని పరిశీలిస్తే రాబోయే ఉత్తర కాండలో జరగబోయే సంఘటనను ముందుగానే ప్రస్తావించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూడు అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం.

రామాయణానికి, గాయత్రీ మంత్రానికీ సంబంధం
నిజంగానే మహర్షి వాల్మీకి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను అనుసరించి 24,000 శ్లోకాలు రాశాడని అనుకుందాం. ఇది విశేషమైన కృషి అని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం గురించి ఎక్కడో ఒకచోట ప్రస్తావన ఉండాలి. కానీ మహర్షి వాల్మీకి రామాయణంలో కానీ, మరెక్కడా కానీ ఈ సంబంధాన్ని ప్రస్తావించలేదు. ఇది కేవలం కాకతాళీయమేనని స్పష్టం అవుతోంది. అనేక పండితులు వాల్మీకి రచించిన శ్లోకాలకు అదనంగా మూల రామాయణంలో అనేక శ్లోకాలు కాలక్రమేణా జోడించినట్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదనంగా జోడించిన శ్లోకాలను తీసివేస్తే, రామాయణంలో 24,000 శ్లోకాల కన్నా తక్కువే ఉంటాయి. ఇది గాయత్రి మంత్రంతో రామాయణ సంబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.

Is Uttar Ramayan Authentic Or Not
సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు! (ఊహా జనిత చిత్రం) (ETV Bharat via Wikimedia Commons)

నారదుడు చేసిన రామరాజ్య వర్ణన
బాలకాండ మొదటి సర్గ 90 నుంచి 97 శ్లోకాల్లో రామరాజ్యం గురించిన సంక్షిప్త వర్ణనలు ఉన్నాయి. ముఖ్యంగా 91 శ్లోకం రామరాజ్యంలో పుత్రమరణం జరగదని పేర్కొంది. ఈ అంశం ఆధారంగా ఉత్తర కాండలో రామరాజ్యంలోని పరిస్థితులను అంచనా వేశారని చెప్పటం కష్టం. వాస్తవానికి ఉత్తర కాండలోని 73 నుంచి 76 వరకు గల సర్గలని పరిశీలిస్తే రామరాజ్యంలో ఒక బ్రాహ్మణ బాలుడి మరణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది రామరాజ్యంలో జరగరాని ఘటన కాబట్టి బాలకాండలో ప్రస్తావించినట్లుగా పుత్రుల మరణం ఉండదన్న అంశం నిరాధారమవుతుంది. ఇది సంఘంలో మారుతున్న సామాజిక నైతికతకు ప్రతిస్పందనగా కనిపిస్తుంది. కాబట్టి దీని ఆధారంగా ఇవన్నీ తరువాతి కాలంలో జోడించిన అంశాలుగా పరిగణిస్తూ, ఉత్తరకాండ రామాయణం అంతర్భాగం కాదన్న అంశాన్ని బలపరుస్తోంది.

సంక్షిప్త రామాయణం పునరుక్తి
వాస్తవానికి బాలకాండలోని 3 వ సర్గలో 10 నుంచి 38 శ్లోకాలు నారదుని సంక్షిప్త రామాయణానికి పునర్వచనం, అంటే తిరిగీ చెప్పటం. ఒకవేళ ఇది ప్రామాణికం అయితే పద్య కావ్యంలో కానీ సాధారణ సాహిత్యంలో కానీ అది అనుచితంగా అనిపిస్తుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే బ్రహ్మ చెప్పిన సంక్షిప్త రామాయణంగా భావిస్తున్న 3వ సర్గలో 10 నుంచి 38 శ్లోకాలను తొలగించినా కథలో ఎలాంటి వ్యత్యాసం రాదు. అందుకే వీటిని తర్వాత కాలంలో జోడించి ఉండవచ్చనని, వీటి ఆధారంగా ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగం అనలేమనే వాదానికి ఊతమిస్తుంది.

Is Uttar Ramayan Authentic Or Not
వాల్మీకి వద్దకు నారదుడు (ఊహా జనిత చిత్రం) (ETV Bharat via Wikimedia Commons)

సీతాదేవిని త్యాగం చేయటం గురించి ప్రస్తావన
ఇక మూడవ అంశాన్ని పరిశీలిస్తే "వైదేహ్యాశ్చ విసర్జనం" అనే పదం నారదుని సంక్షిప్త రామాయణంలో కనిపించదు కానీ బ్రహ్మదేవుడి పునర్వచనంలో కనిపిస్తుంది. పైగా మొత్తం ఉత్తర కాండను ఒక్క వాక్యంలో చెప్పడం ఏ మాత్రం సాధ్యమనే విషయాన్నీ కూడా విశ్లేషకులు పరిశీలించాలి. ఇది ఉత్తర కాండను న్యాయసమ్మతంగా చేయడానికి ఉద్దేశించిన అంశమని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరకాండ రామాయణం అంతర్భాగమా కాదా అనే వాదనను విశ్లేషించడానికి ఉపయోగపడే మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం.

శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసిన రామాయణం
బాలకాండలోని 4వ సర్గలోని 1వ శ్లోకంలో వివరించిన ప్రకారం "ప్రాప్తరాజ్యస్య రామస్య" (తన రాజ్యాన్ని తిరిగి పొందిన రాముని) కథతో వాల్మీకి మహర్షి రామాయణ కథను అర్ధవంతంగా ముగించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే శ్రీరామునికి రాజ్యం లభించి పట్టాభిషేకం జరగడంతో రామాయణం ముగిసిపోవాలి. అంటే ఇక్కడ ఉత్తరకాండ లేదన్న అర్ధమే కదా వస్తుంది.

రావణ వధతోనే ముగిసే రామాయణం
బాలకాండలోని 4 వ సర్గలోని 7 వ శ్లోకంలో వాల్మీకి తాను రచించిన రామాయణానికి "రామాయణం", "సీతాయాశ్చరితం మహత్" "పౌలస్త్య వధ" అనే పేర్లను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకారం చూసినా "పౌలస్త్య వధ" అంటే రావణ వధతో రామాయణానికి ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఉత్తరకాండ లేనట్లే కదా!

రామాయణం ఎన్ని కాండలు?
బాలకాండ 4 వ సర్గలోని 2 వ శ్లోకంలో వివరించిన ప్రకారం వాల్మీకి రామాయణాన్ని షట్ కాండల్లో అంటే 6 కాండల్లో రచించాడని తెలుస్తోంది. కానీ ఉత్తర కాండను కూడా కలిపితే రామాయణం 7 కాండలుగా మారుతుంది. మరి ఇది వాల్మీకి వివరించిన దానికి వ్యతిరేకమే కదా! అంతే కాకుండా రామాయణంలో మొత్తం 500 సర్గలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర కాండను కూడా లెక్కిస్తే 650 సర్గలు అవుతాయి. అందువల్ల ఇవి తర్వాత కాలంలో చేర్చినట్లుగా భావించాలి. ఈ కారణం చేత కూడా ఉత్తర కాండను రామాయణంలో అంతర్భాగంగా చూడలేమని విశ్లేషకుల వాదన.

Is Uttar Ramayan Authentic Or Not
వాల్మీకి మహర్షి (ఊహా జనిత చిత్రం) (ETV Bharat via Wikimedia Commons)

రామాయణానికి ఫలశ్రుతినే ప్రామాణికమా?
పురాతన సాహిత్యం నియమాల ప్రకారం ఏ కావ్యానికైనా, గ్రంధానికైనా ఫలశ్రుతి అనేది సర్వ సాధారణం. ఒకవేళ ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగం అయి ఉంటే రామాయణంలోని 6వ కాండ అయిన యుద్ధ కాండ చివరలో భవిష్యత్కాల రామరాజ్య వర్ణనా, ఫలశ్రుతి రచించి ఉండేవారు కాదు. యుద్ధకాండ ఫలశ్రుతితో ముగిసినప్పుడు, 7వ కాండగా ఉత్తర కాండ ఉండే అవకాశమే లేదన్నది కొందరు విద్వాంసుల వాదన.

దూత వధ
ఉత్తర కాండ 13వ సర్గ 39వ శ్లోకంలో రావణుడు కుబేరుడు పంపిన దూతను చంపినట్లుగా ఉంది. కానీ సుందర కాండలో 52 వ సర్గ 15 శ్లోకంలో హనుమంతుని సంహరించమని రావణుడు ఆదేశించగా విభీషణుడు ఒక దూతను చంపడం ఇప్పటివరకు కనీవినీ ఎరగమని అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఈ రెండు అంశాలు ఒకదానితో మరొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఇది సరిగ్గా రావణాసురుని వధకు ఒక నెల ముందు జరిగిన సంఘటన. ఒకవేళ ఉత్తరకాండలో చెప్పినట్లుగా రావణాసురుడు దూతను చంపడం నిజమే అయితే విభీషణుడు దూతను చంపడం ఎన్నడూ వినలేదని ఎందుకు అంటాడు? కాబట్టి ఈ వాదనలో పస లేదని, దీని ప్రకారం చూసినా ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగం కాదని విశ్లేషకులు వాదిస్తున్నారు.

మహాభారతంలో రామాయణ కథ
మహాభారతం అరణ్య పర్వంలో 272 నుంచి 289 సర్గల్లో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు రామాయణ కథను వివరిస్తాడు. ఈ కథలో కొన్ని అంశాలు వాల్మీకి రామాయణానికి భిన్నంగా ఉన్నప్పటికీ, చివరిదైన 289 సర్గలో శ్రీరామ పట్టాభిషేకంతో రామాయణ కథ ముగిసినట్లుగా ఉంది. దీనిని బట్టి మహాభారత కాలం నాటికి కూడా ఉత్తరకాండ లేదని ఆ తర్వాతనే రామాయణానికి ఉత్తర కాండను జోడించినట్లుగా తెలుస్తోంది.

లవకుశల రామాయణం గానం
బాలకాండ 4వ సర్గలోని 27 నుంచి 29 వరకు ఉన్న శ్లోకాలు లవకుశలు రామాయణాన్ని అయోధ్య వీధుల్లో గానం చేస్తుండగా చూసిన రాముడు వారిని రాజభవనానికి తీసుకువచ్చి సత్కరించినట్లుగా ఉంది. కానీ ఉత్తరకాండ 94వ సర్గలో లవకుశలు రామాయణాన్ని నైమిశారణ్యంలో అశ్వమేధ యాగంలో గానం చేసినట్లుగా ఉంది. ఈ రెండు కథలు విభిన్నంగా ఉండడం చేత కూడా ఉత్తరకాండ ప్రామాణికత ప్రశ్నార్థకంగా మారింది.

సీతని త్యజించటం
ఉత్తరకాండ 42వ సర్గలోని 29వ శ్లోకంలో శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతారాములు 10,000 సంవత్సరాలు భోగభాగ్యాలతో సుఖంగా ఉన్నారని వివరించి ఉంది. ఆ వెంటనే ఉత్తరకాండ 43వ సర్గలో 13-19 శ్లోకాల్లో రాజ్యపౌరులు రాజైన రాముడే మరలా సీతను స్వీకరించినందున, తాము కూడా తమ భార్యల విషయంలో అలాగే ఉండాల్సి వస్తోందని భద్రుడు చెప్పడం జరిగింది. ఒకవేళ అయోధ్య పౌరులకు శ్రీరాముడు సీతను స్వీకరించే విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే 10,000 సంవత్సరాలు మిన్నకుండి ఆ తర్వాత ఆ ప్రస్తావన తేవడం, ఆ కారణంగా శ్రీరాముడు 'వైదేహ్యాశ్చ విసర్జనమ్' చేశాడు అనడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉందన్నది విశ్లేషకుల వాదన. బహుశా అందుకేనేమో ఉత్తరకాండ రామాయణం అంతర్భాగం కాదనడంలోని ఆంతర్యం.

ముగింపు
ఇప్పటివరకు ఉత్తరకాండ రామాయణంలోని అంతర్భాగమా కాదా అనే అంశాలను ప్రామాణికంగా, అందుబాటులో ఉన్న రుజువులతో, అంశాలతో క్రోడీకరించి సమగ్రంగా విశ్లేషించిన తర్వాత రుజువైన అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, ఉత్తర కాండ రామాయణంలోని అంతర్భాగం కాదని, దీనిని తర్వాత కాలంలో మూల రామాయణానికి జోడించారని సుస్పష్టం అవుతోంది. ఈ ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా శ్రీరామాయణం శ్రీరామ భక్తుల మనోభావాలకు, భావోద్వేగాలకు సంబంధించిన విషయం. అందరిపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జైశ్రీరామ్!

- శ్రీనివాస్ జొన్నలగడ్డ, ఈటీవీ భారత్ సీఈవో

టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందించడంలో 30 ఏళ్ల అనుభవం శ్రీనివాస్ జొన్నలగడ్డ (జేఎస్) సొంతం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు ఆయన వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్​లో జేఎస్‌కు అపారమైన నైపుణ్యం ఉంది. ఆయనకు భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం అంటే అమితాసక్తి. వివిధ సింపోజియాల్లో వక్తగా, ప్యానెలిస్ట్‌గా ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు.

Last Updated : Aug 25, 2024, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.