Idana Mata Mandir Story : రాజస్థాన్‌లో ఉదయపుర్‌లో ఇడాన మాత ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారు అగ్నితో స్నానం చేస్తారంట! దాదాపు మూడు రోజులపాటు అగ్నికీలల మధ్యనే ఉన్నా అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కు చెదరదు. ఇప్పటివరకు ఈ మిస్టరీని ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఈ ఆలయ విశేషాలేమిటో చూద్దాం.
అగ్నితో స్నానం చేసే అమ్మవారు
Idana Mata Agni Snan : ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఇడాన మాత ఆలయానికి ఓ విశిష్టత ఉంది. అదేమిటంటే ఇక్కడ అమ్మవారు అగ్నితో స్నానం చేస్తారంట! నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజల కథనం.
ఎవరికీ అంతుచిక్కని రహస్యం
ఈ ఆలయంలో అగ్ని దానంతటదే పుట్టి ఆలయమంతా వ్యాపిస్తుంది. దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వ్యాపించే ఈ మంటలలో దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది.
అగ్ని చూడటానికి పోటెత్తే భక్తులు
ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలా దేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పూజారులు చెబుతున్నారు.
అంతుచిక్కని మిస్టరీ
ఇడాన మాత ఆలయంలో ఈ అగ్ని ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని ఎవరూ కనిపెట్టలేకపోయారు.
పక్షవాత రోగాలను నశింపజేసే శక్తి
Idana Mata Udaipur Rajasthan : ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల అమ్మవారి దర్శనానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక స్థిమితం లేని వారు, డిప్రెషన్‌తో బాధ పడేవారు ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందడం ద్వారా స్వస్థత చేకూరుతుందని విశ్వాసం.
నెరవేరే మనోభీష్టాలు
అమ్మవారి ఆలయంలో నెలకు రెండు మూడు రోజులపాటు ఏర్పడే ఈ మంటలను ప్రత్యంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.
త్రిశూల దర్శనంతో సంతానప్రాప్తి
ఈ ఆలయంలోని మరో విశేషమేమిటంటే ఈ ఆలయంలోని అగ్నిని చూడటం మాత్రమే కాకుండా ఇక్కడున్న త్రిశూలాన్ని కూడా పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తే వారికి అమ్మవారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదట పడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం.
ప్రత్యక్ష భక్తుల కథనం
ఈ ఆలయంలో మంటలను ప్రత్యక్షంగా చూసిన భక్తుల కథనం ప్రకారం ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అయితే ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.