Horoscope Today May 5th 2024 : మే 5న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు మంచి విజయాలను అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా స్నేహితులతో, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, స్నేహాలు వలన ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్ట దేవతారాధనం మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఈ రోజు పలు రకాల ఆర్థిక ప్రయోజనాలకు ఉంటాయి. స్నేహితులను కలవడం, పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం వల్ల సంబంధాలు మెరుగు పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. మహిళ మూలక ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. మీ స్నేహితులు, ప్రియమైన వారితో విహార యాత్రలకు వెళతారు. ఈ రోజు మొత్తం మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. దక్షిణామూర్తి ధ్యానం శుభప్రదం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన వ్యయాలకు చాలా అవకాశం ఉంది. కొన్ని ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు వాటి నుంచి దూరంగా ఉండాలి. ధ్యానం, ఆధ్యాత్మికత మార్గంలో వెళితే ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇష్ట దేవతారాధనతో సమస్యలు నుంచి బయట పడవచ్చు.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో పేరు, ప్రఖ్యాతలను పొందుతారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు చేపట్టిన అన్ని పనులు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు, గౌరవం పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. పిల్లలకు సంబంధించిన సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. షేర్ మార్కెట్లు, స్పెకులేషన్లు నష్టాలు తెచ్చే సూచన ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. గురుగ్రహ శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీకు మానసిక అశాంతి కలుగజేస్తాయి. కుటుంబంలో అస్థిరమైన వాతావరణం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక నష్టం కలగవచ్చు. ఆరోగ్యం సహకరించదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా గడుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండవచ్చు. వృత్తివ్యాపార రంగాల వారు ఈ రోజు మీ పోటీదారులను అధిగమిస్తారు. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం శ్రీలక్ష్మి ధ్యానం చేయండి.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపావేశాలతో మాటలు అదుపు తప్పితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. విద్యార్థులు తమ చదువుల పైన దృష్టి సారించాలి. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలి. ఉద్యోగులకు కొంత సమయం పట్టినా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి శుభసమయం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక లాభాలకు చాలా అవకాశం ఉంది. ఈ రోజు ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయవృద్ధి ఉంది. శివారాధన మేలు చేస్తుంది.