ETV Bharat / spiritual

ఆ రాశివారు కోపాన్ని కంట్రోల్​ చేసుకుంటే బెటర్- లేకుంటే అందరితో గొడవలే! - Horoscope Today March 15th 2024

Horoscope Today March 15th 2024 : మార్చి 15న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 15th 2024
Horoscope Today March 15th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 5:06 AM IST

Horoscope Today March 15th 2024 : మార్చి 15న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీరు అందంగా కనిపించడానికి తెగ ఆరాటపడతారు. ఇందుకు కావాల్సిన అన్ని ఖర్చులు చేస్తారు. డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి.

.

వృషభం (Taurus) : మీ ఆహారపు అలవాట్లలో మార్పులను ఈ రోజు మీరు గమనించవచ్చు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఫలితాలను ఆస్వాదించండి. మీకు నిర్దేశించిన పనులను సకాలంలో ఉత్సాహంతో పూర్తి చేస్తారు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీరు సమయానుకూలంగా నడుచుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మీ మాటలతో ఇంట్లో సభ్యులను నొప్పిస్తారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం బారిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ తారాబలం అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా ఆర్థిక లబ్ధి పొందుతారు. ఆదాయంలోనూ అభివృద్ధిని చూస్తారు. నిధులు సమకూర్చుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ స్నేహితులను ఈ రోజు మీరు కలుసుకుంటారు. వారితో సంతోషంగా గడుపుతారు. పెళ్లికాని వారికి మ్యాచ్​ ఫిక్స్​కు ఈ రోజు అద్భుతంగా ఉంది. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి త్వరలోనే మీకు దొరుకుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లండి. మొత్తంగా ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.

.

సింహం (Leo) : మీ అద్భుతమైన వ్యక్తిత్వం అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఈ రోజు మీలో నింపుతుంది. దీనిని ఆచరణాత్మకంగా అమలు చేస్తారు.

.

కన్య (Virgo) : ఈ రోజు అద్భుతంగా ఉంది. దైవ దర్శనానికి మంచి సమయం. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని నెరవేరుతుంది. కొందరు బంధువులను కలుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి ద్వారా మీరు సంతోషం పొందుతారు. బంధువుల నుంచి లేదా మహిళా స్నేహితుల నుంచి అనేక ప్రయోజనాలు పొందుతారు.

.

తుల (Libra) : ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వాదనలకు దూరంగా ఉండండి. వివాదాలు మీ కోపాన్ని ప్రేరేపిస్తాయి. దీనిని నియంత్రణలో ఉంచుకోండి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అనుకోకుండా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక, మేథో పరమైన అంశాలపై ఆసక్తి కనబరుస్తారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు పరస్పర సంభాషణలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే వ్యక్తులు ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తారు. మీకు కోపం తెప్పించాలని చూస్తారు. వారితో జాగ్రత్త. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. విప్లవాత్మకమైన ఆలోచనలకు దూరంగా ఉండండి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీరు సంతోషకరంగా గడుపుతారు. మీ పట్ల, ఇతరుల పట్ల సంతృప్తిగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. తద్వారా మీరు మరింత సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. మొత్తంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు మీరు ఎక్కువశాతం చింతతోనే గడుపుతారు. మీ తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం ఆందోళనలకు గురిచేయవచ్చు. అభిప్రాయ భేదాలు మీ నిర్ణయాత్మక శక్తిని దెబ్బ తీయవచ్చు. మీ పనితో పై అధికారులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. మీ పోటీదారులతో వాదనలకు దూరంగా ఉండండి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు మానసికంగా చాలా సున్నితమైన స్థితిలో ఉంటారు. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. ఆడవారు తమకు నచ్చిన బ్యూటీ ప్రోడక్ట్స్​ను కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. పరిణితి చెందిన వ్యక్తిలా వ్యవహరించండి.

.

మీనం (Pisces) : ఈ రోజు మీ తారాబలం అనుకూలంగా ఉంది. దీంతో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు సహకారం అందిస్తారు. సాయంత్రం సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. మీ ప్రియమైన వారితో చర్చల్లో పాల్గొంటారు. వారు మీకు మరింత దగ్గరవుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.