Horoscope Today July 30th 2024 : జులై 29న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రోజు కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపం అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడంపై దృష్టి సారించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా అభివృద్ధి, ఆర్థికంగా విశేష ధన లాభం చేకూరే అవకాశాలున్నాయి. ఉద్యోగులు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వినోద కార్యకలాపాలకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారు ఈ రోజు చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకుంటూ మాట్లాడేది పొరబాటు లేకుండా మాట్లాడాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సానుకూల దృక్పధంతో ముందుకెళ్తే చేసే ప్రతిలోనూ విజయం ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకోకుండా, ఆర్థిక లబ్ధి, ఆదాయ మార్గాల అభివృద్ధి జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో, సానుకూల ఆలోచనలలో మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తండ్రితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. పిత్రార్జిత ఆస్తిని పొందే సూచనలున్నాయి. భూమి, ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు. ఆర్ధిక విషయాల్లో విశేష శుభ ఫలితాలుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల అలసట, బద్ధకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ వ్యతిరేక పరిస్థితులే ఎదురైనట్టు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులు పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రత్యర్థులుపై విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. లేకుంటే అందరితో వివాదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దండకం చదువుకుంటే మంచిది.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ రోజు సరదాగా, సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతం గా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసివస్తాయి. కుటుంబంలో సమన్వయ ధోరణితో కలిసి మెలిసి ఉంటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. ఈ రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు. గురు శ్లోకాలు పఠించడం శుభకరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు, అవాంతరాలు ఎదురు కావడంతో రోజులో ఎక్కువ భాగం విచారం, చింతలతోనే వెళ్లదీస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధమైన చికాకులు. అభిప్రాయ భేదాలతో విచారంతో ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తే సీనియర్ల మెప్పు పొందే అవకాశం ఉంది. పోటీ దారులతోనూ, తోటివారితోనూ వాదనల్లోకి దిగవద్దు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధంగా రాణిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తే మంచిది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి . ముఖ్యమైన వ్యవహారాల్లో పరిణితితో వ్యవహరిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే లాభిస్తాయి. త్వరలో సత్ఫలితాలను పొందుతారు. మీ సృజనాత్మకత సామర్థ్యం , మీ దృఢ నిశ్చయం, మీ విజయ పథాన్ని నిర్థారిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. దుర్గాధ్యానం శుభకరం