ETV Bharat / spiritual

ఆ రాశివారు నేడు బీకేర్ ఫుల్- సూర్య ఆరాధన చేయడం మేలు! - Horoscope Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 4:43 AM IST

Horoscope Today July 26th 2024 : జులై​ 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Horoscope Today (ETV Bharat)

Horoscope Today July 26th 2024 : జులై​ 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో శ్రమతో కూడిన విజయం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిళ్లు పెరగవచ్చు. ఈ రోజు మీరు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. పొదుపును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచిరోజు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారు తీవ్రమైన శ్రమతోనే విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల కారణంగా మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులకు స్థానచలనం జరిగే సూచన ఉంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వచ్చి చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సన్నిహితుల, శ్రేయోభిలాషుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. యోగా, ధ్యానంతో ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు కాదు. కోపాన్ని, మాటతీరును అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కారం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో తీరికలేని పనుల్లో నిమగ్నమై ఉంటారు. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. స్థాన చలనం కూడా ఉండవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. విజయవంతంగా పోటీదారులను అధిగమించడానికి అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర ప్రయాణం మనోబలాన్ని పెంచుతుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజు వృత్తి, వ్యాపార రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ధన నష్టాలు సంభవిస్తాయి. ఉద్యోగంలో తీవ్రమైన పనిఒత్తిడి ఉండవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై కూడా దృష్టి సారించలేకపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కళలు, సాహిత్య రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ కీర్తి, ప్రతిష్టలకు భంగం వాటిల్లే సంఘటనలు జరగవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున సహనంతో ఉండడం చాలా అవసరం. మీ స్వధర్మమే మిమ్మల్ని కఠినమైన పరిస్థితుల నుంచి బయట పడేస్తుంది. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండండి. కుటుంబంలో కలహపూరిత వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అభయ ఆంజనేయస్వామి ప్రార్థనతో ఆపదలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.