Horoscope Today July 22nd 2024: జులై 22న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికంగా కాలం గడుపుతారు. వృత్తి వ్యాపారులకు ప్రభుత్వపరంగా కొత్త ప్రాజెక్టులు, టెండర్లు పొందుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. గతంలో చేసిన పొదుపును పెట్టుబడిగా మార్చడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారు ఎన్నో రోజులుగా కలలు కంటున్న విదేశీ ప్రాజెక్టులను చేజిక్కుంచుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళతారు. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాముల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో నష్టాలను చూడాల్సి ఉంటుంది. వృత్తి పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ రావడం వల్ల గృహంలో సంతోషం నెలకొంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పెద్దలతో వాదప్రతివాదాలు చేయకండి. ప్రతికూల ఆలోచనలు వీడండి. యోగా, ధ్యానంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొత్తగా ఏ పని ఈ రోజు మొదలు పెట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పని భారం పెరగడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలకు రాజీధోరణి ఉత్తమం. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. జల గండం ఉంది కాబట్టి నీటికి దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయ సూచన ఉంది. సన్నిహితుల సహకారం ఉంటుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సంతానం భవిష్యత్ పట్ల ఆందోళనతో ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తితో ఉంటారు. సూర్య ఆరాధన మంచిది.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తే విజయం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పట్ల వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. అసూయా పరుల కారణంగా మీ కీర్తికి భంగం కలిగే అవకాశం కూడా ఉంది. డబ్బు విపరీతగా ఖర్చవుతుంది. శివాభిషేకం జరిపించుకుంటే మేలు జరుగుతుంది.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సహనంతో ఉండాల్సిన సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. మౌనం పాటిస్తే మేలు. ఆరోగ్యం బాగుటుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి. దుర్గా దేవి ధ్యానం మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. కార్యసిద్ధి శత్రుజయం ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలం. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.