ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి బిజినెస్​లో లాస్​! శివారాధన శ్రేయస్కరం! - Horoscope Today August 2nd 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 4:57 AM IST

Horoscope Today August 2nd 2024 : ఆగస్టు​ 2న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today August 2nd 2024
Horoscope Today August 2nd 2024 (ETV Bharat)

Horoscope Today August 2nd 2024 : ఆగస్టు​ 2న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో చెప్పుకోతగ్గ మార్పులేమీ ఉండవు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థానచలనం సూచన ఉంది. స్థిరాస్తి రంగం వారు నేడు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది. కీలమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడదు. కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరిస్తే మంచిది. వ్యాపారులు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తారాబలం అనుకూలంగా లేనందున ఈ రోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, సవాళ్లు ఎదురు కావచ్చు. ఉద్యోగంలో, వ్యాపారాలలో పోటీ పెరుగుతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు సమర్థవంతంగా ఉండకపోవచ్చు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చదువుపై దృష్టి సారిస్తే మంచిది. వ్యాపారులు ముఖ్యమైన దరఖాస్తులపై సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సర్వత్రా అనుకూలతలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగులు తిరుగులేని ప్రతిభతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తారాబలం అనుకూలంగా లేనందున చేపట్టిన అన్ని పనులు ఆలస్యం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టం ఆందోళనకు గురి చేస్తుంది. కీలకమైన వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహా అవసరం. కుటుంబ కలహాల విషయంలో ఉదాసీనంగా లేకపోతే మానసిక అశాంతి తప్పదు. వీలైనంత వరకు చర్చలకు, వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా కూడా నష్టాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటాయి. ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి, ఆదాయం వృద్ధి ద్వారా మీకు కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు కొనుగోలు, అమ్మకాలతో మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణం లాభిస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. అనుకోకుండా ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశాల నుంచి వచ్చే శుభవార్త వల్ల ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారు ప్రతి విషయంలో ఆచి తూచి వ్యహరించాలి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉండవచ్చు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విశేషమైన ధనయోగం ఉంటుంది. కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. చేపట్టిన వృత్తిలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. కళాకారులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేస్తారు. సమాజంలో మంచి హోదా వస్తుంది. పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆర్థికంగా అనుకూలత, వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి శుభసమయం నడుస్తోంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగించవచ్చు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అభిప్రాయం భేదాలు రావచ్చు. కుటుంబంలో కలహాల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది. కీలకమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. ఉద్యోగంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శ్రీ దుర్గాదేవి ధ్యానంతో సమస్యలు తొలగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.