ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి అన్నీ ప్రతికూల ఫలితాలే- నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today August 28th 2024 : ఆగస్టు​ 28వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 2:51 AM IST

Horoscope Today August 28th 2024 : ఆగస్టు​ 28వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నప్పటికినీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక అంశాలలో దృఢ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తి వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి స్తంభిస్తుంది. ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సహచరుల మధ్య, సన్నిహితులతో అనవసర కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ రోజు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాల కారణంగా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుబాటు తత్వం కలిగి ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పని భారం పెరగడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే ఆస్కారముంది. పని ప్రదేశంలో సహచరులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణ శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వివాదాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. గణపతి ప్రార్ధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇది కొత్త పనులు చేపట్టడానికి, ఆర్థిక ప్రణాళికలను అమలుపరచడానికి అద్భుతమైన రోజు. కళాకారులకు, రచయితలకు అనుకూలంగా ఉంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పనులు అనుకున్నట్టుగా సాగవు. అందుకే కొత్త కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. కుటుంబ వాతావరణం ఎలాంటి సమస్యలు లేకుండా సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. పోటీదారులుపై ఘన విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, తమ తమ రంగాలలో స్థిరమైన పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సవాళ్లు ఎదురైనా మీ ప్రతిభతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలలో శుభవార్తలు వింటారు. సంపద పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. భావోద్వేగానికి లోను కాకుండా ప్రశాంతం ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఈ రోజు ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. కీలకమైన వ్యవహారాలు ముందుకు సాగక పోవడం వల్ల మానసికంగా చికాకుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కీలకమైన వ్యవహారాల్లో మొండిగా లేకుండా పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో అనుకోని సవాళ్లు ఎదురుకావడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీ పరుషమైన మాటలతో సన్నిహితులను ఇబ్బంది పెడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి. శ్రీ దుర్గాదేవి ధ్యానంతో అనుకూల ఫలితాతాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.