ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రమోషన్​ పక్కా! షేర్​ మార్కెట్​లోనూ భారీ లాభాలు!! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 4:50 AM IST

Horoscope Today August 1st 2024 : ఆగస్టు​ 1న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today August 1st 2024
Horoscope Today August 1st 2024 (ETV Bharat)

Horoscope Today August 1st 2024 : ఆగస్టు​ 1న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో విహార యాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు పనికి రాదు. ముందుచూపుతో వ్యహరిస్తే మంచిది. తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు, సమయం వృధా కావచ్చు. కీలమైన విషయాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. కళాకారులు, రచయితలకు కలిసి వస్తుంది. అందివచ్చిన అవకాశాలు వినియోగించుకుని ఉత్తమమైన సృజనకి శ్రీకారం చుట్టండి. సమాజంలో పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంటికి అతిధులు రావడం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకోని ఆటంకాలు, సవాళ్లు ఎదురుకావడం వల్ల గందరగోళం, అయోమయం పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఎటు చూసినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్ధిక లాభాలు ఉంటాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు విపరీతమైన లాభాలను అందుకుంటారు. కళాకారులకు, రచయితలు సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. అన్ని పనులు సునాయాసంగా, సకాలంలో పూర్తవుతాయి. దైవబలం అండగా ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కళారంగం, చిత్ర లేఖనం రంగాల వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజు ప్రారంభించిన పనులన్నీ దైవబలంతో దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. పొదుపు ప్రణాళికలపై దృష్టి సారిస్తే మంచిది. వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తివ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. ముఖ్యమైన పనులు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్త కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు పట్టుదలతో పనిచేసి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. సమాజంలో హోదా, పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. వ్యాపారస్థులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ కలహాల కారణంగా ఈ రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. శ్రీ అభయ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతిపనిలోనూ ఆటంకాలు ఎదురుకావడం వల్ల చాలా నిరాశగా ఉంటారు. ఆర్ధిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదముంది. ధననష్టం సంభవించవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని అనుకోని ఘటనల కారణంగా విచారంగా ఉంటారు. ఉద్యోగస్థులకు స్దానచలనం ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలకు దిగడం సరైన పని కాదు. వృత్తిపరంగా కూడా నష్టాలు ఉండవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.