Horoscope Today April 30th 2024 : ఏప్రిల్ 30న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పని ప్రదేశంలో ప్రతికూలతలు ఎదురవుతాయి కాబట్టి సహనంతో ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వివాదాలు రావు. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. మెరుగైన ఫలితాల కోసం ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగు విశ్రాంతి అవసరం. ఆరోగ్యం సహకరించదు. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతారు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులను వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీరిక లేని పనుల నుంచి కొంత విరామం తీసుకొని హాయిగా గడపండి. విహారయాత్రలకు, విందు వినోదాలకు వెళితే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రుజయం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మాతృవర్గం నుంచి అందిన ఓ శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది. మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం దుర్గాదేవి ధ్యానం చేయండి.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అందరి సహకారం ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు ఈ రోజు లాభాలు, మంచి అదృష్టం , సంపద లభిస్తాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు పురోగతి ఉంటుంది. గణపతి ధ్యానం మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఇంటా బయట ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ సొంత వ్యక్తుల ద్వారా అవమానం కలగవచ్చు. పరిణితితో ఆలోచించి ఆచి తూచి ముందడుగు వేయండి. ధన నష్టం సూచితం. ఖర్చులు పెరుగుతాయి. శివారాధనతో సమస్యలు తొలగుతాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకొని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మేలు. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి, తక్కువ ఫలితాలు ఉండడం చేత ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు. ఓర్పుతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. ఇంట్లో గొడవలకు, వాదనలకు దూరంగా ఉండండి. మీ సహనంతోనే అన్ని సమస్యలకి పరిస్కారం దొరుకుతుంది. ఖర్చులకు సరిపడా ఆదాయం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి స్పెకులేషన్ లాభిస్తుంది. దైవబలం అండగా ఉంటుంది. ఈశ్వర ఆరాధనతో శుభఫలితాలు పొందవచ్చు.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నా మీ చాకచక్యంతో అన్నింటిని పరిష్కరిస్తారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శన చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. రోజు ప్రథమార్ధంలో కొన్ని సమస్యలు ఉన్నా సునాయాసంగా తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మీ ప్రమేయం లేకుండా కోర్టు వ్యవహారాలలో చిక్కుకుంటారు. శని శ్లోకాలు చదివితే ప్రమాదాల నుంచి బయట పడవచ్చు.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సామాజికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా, గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇంట్లోనే మీకు శత్రువులు తయారవుతారు. ఈ పరిస్థితులు మీ కుటుంబంలోని సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. శివారాధనతో పరిస్థితులు చక్కబడతాయి.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యారులకు వ్యాపారం అద్బుతంగా సాగుతుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉద్యోగులకు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ పని ఉన్నతాధికారులకు సంతోషం కలిగిస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారందరికీ వారు ఎంచుకున్న రంగంలో మంచి పురోగతి ఉంటుంది. లాభాలు, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.